తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rana On Project K: బాహుబలి, ఆర్ఆర్ఆర్‌ చేయలేనిది ప్రాజెక్ట్ కే చేస్తుంది: రానా

Rana on Project K: బాహుబలి, ఆర్ఆర్ఆర్‌ చేయలేనిది ప్రాజెక్ట్ కే చేస్తుంది: రానా

Hari Prasad S HT Telugu

02 June 2023, 10:01 IST

    • Rana on Project K: బాహుబలి, ఆర్ఆర్ఆర్‌ చేయలేనిది ప్రాజెక్ట్ కే చేస్తుందని అన్నాడు రానా దగ్గుబాటి. ప్రభాస్ నటిస్తున్న సైంటిఫిక్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీపై రానా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
ప్రాజెక్ట్ కే మూవీ
ప్రాజెక్ట్ కే మూవీ

ప్రాజెక్ట్ కే మూవీ

Rana on Project K: టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి.. ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కే (Project K) మూవీపై కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈ మూవీ తెలుగు నుంచి తొలి గ్లోబల్ ఫిల్మ్ గా నిలుస్తుందని అనడం విశేషం. ఈ సినిమా గురించి తాను చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు చెప్పాడు. ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో రానా ఈ సినిమాపై స్పందించాడు.

ట్రెండింగ్ వార్తలు

Aavesham OTT: ఓటీటీ హక్కుల విషయంలో ఆవేశం మూవీ రికార్డు.. ఎన్ని కోట్లంటే.. మరికొన్ని గంటల్లోనే స్ట్రీమింగ్!

Project Z OTT: ఆరున్నరేళ్ల తర్వాత ఓటీటీలోకి వస్తున్న సందీప్ కిషన్ సినిమా 'ప్రాజెక్ట్ జెడ్'

Heeramandi Sex Scene: ఆ బోల్డ్ సెక్స్ సీన్ అందుకే చేయాల్సి వచ్చింది.. మగాళ్లంటే ఇష్టం లేకే..: సోనాక్షి సిన్హా

Bastar The Naxal Story OTT: అదాశర్మ ‘బస్తర్: ది నక్సల్ స్టోరీ’ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. తెలుగులో కూడా..

"సౌతిండియాలో మేము ఒకరి సినిమాలను మరొకరం సెలబ్రేట్ చేసుకుంటాం. ఇప్పుడో మూవీ వస్తోంది. దాని పేరు ప్రాజెక్ట్ కే. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ప్రభాస్, దీపికా, అమితాబ్ బచ్చన్ నటిస్తున్న సినిమా అది. తెలుగులో ఆ సినిమా కోసం మేము చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం.

ఈ మూవీ సరిహద్దులను చెరిపేస్తుంది. ఇప్పటి వరకూ బాహుబలి, ఆర్ఆర్ఆర్ కు సాధ్యం కాని పని అది. నేను కూడా ఆ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను. ప్రాజెక్ట్ కే తెలుగు నుంచి ఓ గ్లోబల్ ఫిల్మ్ అవుతుందని నేను అనుకుంటున్నాను" అని రానా అనడం విశేషం.

వైజయంతీ మూవీస్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కే మూవీలో దీపికా పదుకోన్ తోపాటు మరో బాలీవుడ్ నటి దిశా పటానీ కూడా కీలకపాత్రలో కనిపించనుంది. ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న మూవీ ఇది.

ప్రభాస్, దీపికా పదుకోన్ జంటగా నటిస్తున్న 'ప్రాజెక్ట్ K' చిత్రాన్ని జనవరి 12, 2024న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం పేర్కొంది. దీనికి సంబంధించి పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. అయితే ఈ లెక్క.. రివర్స్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

షూటింగ్ ఆలస్యమైతే.. విడుదల తేదీ కూడా మారనుంది. కొన్ని రోజుల కిందట అమితాబ్ బచ్చన్ గాయపడ్డాడు. ఆయన కోలుకోవడం ఆలస్యమవడంతో సినిమా పనులు ఆలస్యమయ్యాయి. దీంతో ' ప్రాజెక్ట్ K ' సినిమా అనుకున్న తేదీకి విడుదల అవడం కష్టమేనని అంటున్నారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.