తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bastar The Naxal Story Ott: అదాశర్మ ‘బస్తర్: ది నక్సల్ స్టోరీ’ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. తెలుగులో కూడా..

Bastar The Naxal Story OTT: అదాశర్మ ‘బస్తర్: ది నక్సల్ స్టోరీ’ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. తెలుగులో కూడా..

08 May 2024, 14:14 IST

    • Bastar: The Naxal Story OTT Release Date: బస్తర్: ది నక్సల్ స్టోరీ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. ఆ వివరాలివే..
Bastar The Naxal Story OTT: అదాశర్మ ‘బస్తర్: ది నక్సల్ స్టోరీ’ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. తెలుగులో కూడా..
Bastar The Naxal Story OTT: అదాశర్మ ‘బస్తర్: ది నక్సల్ స్టోరీ’ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. తెలుగులో కూడా..

Bastar The Naxal Story OTT: అదాశర్మ ‘బస్తర్: ది నక్సల్ స్టోరీ’ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. తెలుగులో కూడా..

Bastar: The Naxal Story OTT: అదా శర్మ ప్రధాన పాత్ర పోషించిన ‘బస్తర్: ది నక్సల్ స్టోరీ’ సినిమా వివాదాస్పదమైంది. సుదీప్తో సేన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. గతంలో వీరి కాంబినేషన్‍లో వచ్చిన ‘ది కేరళ స్టోరీ’ వివాదం కావటంతో పాటు బ్లాక్‍బస్టర్ అయింది. అయితే, ‘బస్టర్: ది నక్సల్ స్టోరీ’ విషయంలో అది రిపీట్ కాలేదు. ఈ ఏడాది మార్చి 15వ తేదీన రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేకపోయింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

Devara Fear Song: దేవర నుంచి వచ్చేసిన ఫియర్ సాంగ్.. పవర్‌ఫుల్‍గా ఫస్ట్ పాట: చూసేయండి

Adivi Sesh: హనీమూన్ ఎక్స్‌ప్రెస్ వదిలిన అడవి శేష్.. అన్నపూర్ణ ఏడెకరాల ప్రాంగణంలో అప్డేట్

Keerthy Suresh Kalki 2898 AD: కల్కి 2898 ఏడీలో కీర్తి సురేష్.. ప్రభాస్‌కు ప్రాణ మిత్రుడిగా మహానటి

Murari Movie: మురారి సినిమాలో మహేశ్‍కు జీడీగా సోనాలీ కంటే ముందు ఈ బాలీవుడ్ భామను అనుకున్నారట!

స్ట్రీమింగ్ డేట్

బస్తర్: ది నక్సల్ స్టోరీ మూవీ మే 17న తేదీన జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని నేడు (మే 8) సోషల్ మీడియాలో జీ5 అధికారికంగా ప్రకటించింది. హిందీతో పాటు తెలుగులోనూ మే 17న ఈ సినిమా స్ట్రీమింగ్‍కు వస్తుందని వెల్లడించింది.

“సిన్సియర్ పోలీస్ ఆఫీసర్, భీకర ఫైటర్ ఐపీఎస్ నీరజా మాధవన్ (అదా శర్మ).. నక్సలిజాన్ని అరికట్టేందుకు వస్తున్నారు. మే 17న బస్తర్ జీ5లో హిందీ, తెలుగులో ప్రీమియర్ అవుతుంది” అని జీ5 ట్వీట్ చేసింది. ఈ చిత్రంలో పోలీస్ అఫీసర్ నీరజా మాధవన్‍గా అదా శర్మ నటించారు.

బస్తర్ ది నక్సల్ స్టోరీ మూవీని దర్శకుడు సుదీప్తో సేన్ తెరకెక్కించారు. సుదీప్తోతో పాటు అమర్‌నాథ్ జా, విపుల్ అమృత్ లాల్ షా ఈ మూవీకి కథ రాశారు. సన్‍షైన్ పిక్చర్స్ పతాకంపై విపుల్ అమృత్ లాల్ షా నిర్మించారు.

బస్తర్ మూవీలో అదా శర్మతో పాటు ఇందిరా తివారీ, నమన్ జైన్, రైమా సేన్, యశ్‍పాల్ శర్మ కీలకపాత్రుల చేశారు. విశాఖ్ జ్యోతి సంగీతం అందించిన ఈ మూవీకి రాహుల్ ధారుమన్ సినిమాటోగ్రఫీ చేశారు.

స్టోరీ లైన్ ఇదే

నక్సలైట్ల దాడిలో 76 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందడం.. ఆ తర్వాత నక్సలైట్లను అడ్డుకునేందుకు ఐపీఎస్ నీరజా మాధవన్ (అదా శర్మ) రంగంలోకి దిగడం చుట్టూ బస్తర్ మూవీ స్టోరీ సాగుతుంది. నక్సలైట్ల కార్యాకలాపాలు, దాడుల గురించి ఈ మూవీలో మేకర్స్ చూపించారు. అలాగే, నక్సలైట్లతో నీరజా ఎలా పోరాడారన్న విషయాన్ని తెరకెక్కించారు. అయితే, ఈ చిత్రానికి ఆరంభం నుంచే మిక్స్డ్ టాక్ వచ్చింది. అదా శర్మ నటన, యాక్షన్‍కు ప్రశంసలు వచ్చినా.. మిగిలిన విషయాల్లో మిశ్రమ స్పందనను ఈ చిత్రం దక్కించుకుంది. మొత్తంగా అనుకున్న స్థాయిలో కలెక్షన్లు రాలేదు.

పొలిటికల్ థ్రిల్లర్ సిరీస్

జీ5 ఓటీటీలో పొలిటికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ తలైమై సేయలగం వస్తోంది. మే 17వ తేదీన ఈ సిరీస్ స్ట్రీమింగ్‍కు రానుంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సిరీస్ అందుబాటులోకి వస్తుంది. కిశోర్, శ్రీయారెడ్డి, భరత్, రమ్య నంబీషన్, ఆదిత్య మీనన్ ఈ సిరీస్‍లో ప్రదాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్‍కు దర్శకుడు వసంతబాలన్ దర్శకత్వం వహించారు. రాడాన్ మీడియా వర్క్స్ బ్యానర్‌పై రాధికా శరత్ కుమార్, శరత్ కుమార్ ప్రొడ్యూజ్ చేశారు. తలైమై సేయలగం సిరీస్‍ను మే 17 నుంచి జీ5 ఓటీటీలో చూడొచ్చు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం