Prabhas Adipurush Update: భారీ ధరకు ఆదిపురుష్ థియేట్రికల్ రైట్స్.. ప్రభాస్ దెబ్బకు రికార్డుల వర్షమే..!
Prabhas Adipurush Update: ప్రభాస్ నటించిన ఆదిపురుష్ చిత్రా థియేట్రికల్ రైట్స్ తెలుగులో భారీ స్థాయికి అమ్ముడైనట్లు తెలుస్తోంది. అదే నిజమైతే.. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులు, మైలురాళ్లు సృష్టించబడతాయి.
Prabhas Adipurush Update: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ మూవీ గురించే ఇప్పుడు ఎక్కడ చూసినా చర్చ జరుగుతోంది. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ జూన్ 16న విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్, ట్రైలర్, పాటలు విడుదలై ప్రేక్షకుల్లో అంచనాలను భారీగా పెంచేశాయి. దీంతో ఆదిపురుష్ మూవీపై బజ్ ఏర్పడింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఆదిపురుష్ థియెట్రికల్ రైట్స్ భారీ స్థాయిలో అమ్ముడైనట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఆదిపురుష్ మూవీకి భారీగా బిజినెస్ జరుగుతోంది. ఎంతలా అంటే ఈ సినిమాకు థియేట్రికల్ హక్కులను రూ.160 నుంచి 170 కోట్ల భారీ ధరకు అమ్ముడుపోయినట్లు ఫిల్మ్ వర్గాల సమాచారం. ఈ వార్త నిజమైతే.. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఆదిపురుష్ సరికొత్త రికార్డులను సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. థియేట్రికల్ రైట్సే ఇంత భారీ ధరకు అమ్ముడైతే.. నాన్ థియేట్రికల్ రైట్స్ విషయంలో ఈ సినిమా సరికొత్త బెంచ్ మార్కుగా నిలిచే అవకాశముంది.
ఫిల్మ్ వర్గాల సమాచారం ప్రకారం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ రెండు రాష్ట్రాల్లోనూ ఆదిపురుష్ థియేట్రికల్ రైట్స్ సొంతం చేసుకుందని టాక్. అయితే ఈ విషయంపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. ఇంక మూవీ విషయానికొస్తే ఆదిపురుష్ చిత్రాన్ని తొలుత జనవరిలోనే విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే ఈ సినిమా టీజర్‌పై ఫ్యాన్స్ నుంచి విమర్శలు ఎదురుకావడంతో.. విజువల్స్ విషయంలో చాలా మార్పులు చేశారు. ఫలితంగా సినిమా విడుదలను వాయిదా వేశారు.
ఇటీవల విడుదలైన ఆదిపురుష్ ట్రైలర్‌కు మంచి స్పందన రావడంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా కలర్ ప్యాలెట్, అదనపు సీజీఐ షాట్స్, విజువల్స్‌లో చాలా వరకు మార్పులు, చేర్పులు చేసింది ఆదిపురుష్ టీమ్. ట్రైలర్ విడుదలైన అనంతరం మంచి స్పందన లభించినప్పటికీ కొంతమంది మాత్రం ఇంకా కొన్ని మార్పులు సూచిస్తూనే ఉన్నారు. ఒరిజినల్ స్టోరీకి ఈ సినిమా మాస్క్ వేసినట్లుందని తెలుపుతున్నారు. మరి సినిమా విడుదలైన తర్వాత ఎలాంటి రిజల్ట్ వస్తుందో వేచి చూడాలి.
రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటించగా.. సీతగా బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్ ముఖ్య పాత్రలను పోషించారు. అంతేకాకుండా టీ-సిరీస్, రెట్రోపైల్స్ బ్యానర్లలో భూషన్ కుమార్, క్రిషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేశ్ నాయర్ నిర్మిస్తున్నారు. తన్హాజీ ఫేమ్ ఓం రౌత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సాచేత్ పరంపరా సంగీతాన్ని సమకూరుస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్‌లో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా ఏకకాలంలో విడుదల కానుంది. జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
సంబంధిత కథనం