Prabhas : త్రిషతో రొమాన్స్ చేసేందుకు చొక్కా తీయడానికి సిగ్గుపడ్డ ప్రభాస్!-prabhas shy to remove his shirt for romance with trisha in pournami movie shooting ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Prabhas : త్రిషతో రొమాన్స్ చేసేందుకు చొక్కా తీయడానికి సిగ్గుపడ్డ ప్రభాస్!

Prabhas : త్రిషతో రొమాన్స్ చేసేందుకు చొక్కా తీయడానికి సిగ్గుపడ్డ ప్రభాస్!

Anand Sai HT Telugu
May 28, 2023 06:55 AM IST

Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వ్యక్తిగత జీవితంలో చాలా చిల్ గా ఉంటాడు. అయితే అతడికి దగ్గరి వ్యక్తులతోనే మూవ్ అవుతాడు. కొత్తవారైతే.. మాట్లాడేందుకు కూడా సిగ్గుపడుతాడు. ఈ విషయం అతడి ఫ్యాన్స్ కు కూడా తెలుసు. ఓ సినిమా షూటింగ్ సందర్భంగా చొక్కా తీసేందుకు కూడా ప్రభాస్ సిగ్గుపడ్డాడు.

ప్రభాస్
ప్రభాస్ (AFP)

రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి(Bahubali)తో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. వరుస పెట్టి ప్రాజెక్ట్స్ చేస్తు్న్నాడు. ఇప్పుడు అతడి చేతిలో అన్ని పాన్ ఇండియా సినిమాలే ఉన్నాయి. ప్రభాస్ ఆదిపురుష్‌(Adipurush) 16 జూన్ 2023న విడుదలవుతోంది. సాలార్, ప్రాజెక్ట్ కె, రాజా డీలక్స్, స్పిరిట్ క్రేజీ ప్రాజెక్ట్‌లు లైన్లో ఉన్నాయి. ఆదిపురుష్ లో రాముడిగా ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు. అయితే ప్రభాస్(Prabhas) ఒకప్పుడు తన షర్ట్ తీసేసి సినిమాలో నటించేందుకు బాగా భయపడిపోయాడు. చొక్కా లేకుండా ఒక సన్నివేశానికి ధైర్యంగా వెళ్లడానికి నిరాకరించాడని చాలామందికి తెలియదు.

ప్రభుదేవా(Prabhu Deva) దర్శకత్వంలో ప్రభాస్ పౌర్ణమి(Pournami)లో నటించిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. ఈ సినిమాలో ఛార్మీ, త్రిషతో ప్రభాస్ రొమాన్స్ చేశాడు. పౌర్ణమి సినిమాలో ఓ సన్నివేశం ఉంటుది. ప్రభాస్, త్రిష దగ్గరయ్యే సన్నివేశం ఉంది. ఈ సీన్‌లో ప్రభాస్, త్రిష రొమాన్స్ చేస్తూ.. పైన బట్టలు లేనట్టుగా కనిపించాలి.

దర్శకుడు ప్రభాస్‌ని షర్ట్‌ తీసేయమని కోరగా, 'లేదు లేదు. నేను సిగ్గుపడుతున్నాను. అలా చేయను. చొక్కా వేసుకుంటాను. ఎడిటింగ్ విషయంలో చూసుకో.' అని చెప్పాడట. సీన్ తీసి.. ఎడిట్ చేస్తే సహజంగా అనిపించక పోవడంతో దర్శకుడు ప్రభుదేవా ఒప్పించే ప్రయత్నం చేసినా ప్రభాస్ వినలేదు.

ఈ క్రమంలో మూడు రోజుల పాటు షూటింగ్‌ను కూడా వాయిదా వేశాడు దర్శకుడు. తరువాత కృష్ణంరాజు మనం నటిస్తున్నాం అంతే అని శిక్షణ ఇచ్చి సినిమా షూటింగ్‌కి పంపారు. అప్పుడు కూడా ఈ సీన్ తీసేందుకు ప్రభాస్(Prabhas) నాలుగు గంటల సమయం తీసుకున్నాడు. రాధే శ్యామ్‌లో కూడా, పూజా హెగ్డే(Pooja Hegde)తో సన్నిహిత సన్నివేశాల సమయంలో ప్రభాస్ చాలా ఇబ్బందిని ఎదుర్కొన్నాడు.

ప్రస్తుతం వరుస సినిమాలతో ప్రభాస్ బిజీ బిజిగా ఉన్నాడు. మారుతీ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న సినిమా పేరు రాజా డీలక్స్‌గా ప్రచారంలో ఉంది. ఈ సినిమా షూటింగ్ ఈ నెలాఖరు కల్లా పూర్తవుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీకరణలో తీరికలేకుండా గడుపుతున్న డార్లింగ్ మూవీని మే 26 కల్లా పూర్తి చేయనున్నట్లు సమాచారం. దీంతో ఫ్యాన్స్ సహా ప్రతి ఒక్కరూ సర్ ప్రైజ్ అవుతున్నారు. అసలు ఎప్పుడు మొదలు పెట్టారు, ఎప్పుడు పూర్తి చేశారు అంటూ షాక్ అవుతున్నారు.

మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ లీడింగ్ యాక్ట్రెస్‌గా చేస్తున్నారు. రొమాంటిక్ హర్రర్‌గా జోనర్‌లో రాబోతున్న ఈ సినిమా వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రాజెక్టు-కేపై ఫోకస్ పెట్టనున్నారట. ఇప్పటికే ఈ సినిమాలో కొంత భాగం షూటింగ్ పూర్తి చేసిన ప్రభాస్.. ఇక పూర్తి స్థాయిలో ప్రాజెక్టు కేపైనే దృష్టి పెట్టనున్నారు. దీపికా పదుకొణె, దిశా పటానీ హీరోయిన్లుగా చేస్తున్నారు. అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

IPL_Entry_Point