Adipurush: ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. ఆదిపురుష్ ప్రీమియర్ షో రద్దు-adipurush premier show at tribeca festival cancelled ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Adipurush: ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. ఆదిపురుష్ ప్రీమియర్ షో రద్దు

Adipurush: ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. ఆదిపురుష్ ప్రీమియర్ షో రద్దు

Hari Prasad S HT Telugu
May 17, 2023 09:17 AM IST

Adipurush: ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. ఆదిపురుష్ ప్రీమియర్ షో రద్దు చేశారు ట్రిబెకా ఫెస్టివల్ నిర్వాహకులు. మొత్తం మూడు షోలను ప్లాన్ చేయగా.. అందులో ఒకదానిని రద్దు చేశారు.

ప్రభాస్ తాజాగా రిలీజ్ చేసిన ఆదిపురుష్ పోస్టర్
ప్రభాస్ తాజాగా రిలీజ్ చేసిన ఆదిపురుష్ పోస్టర్

Adipurush: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కు ఓ బ్యాడ్ న్యూస్ చెప్పారు ట్రిబెకా ఫెస్టివల్ నిర్వాహకులు. అతని ఆదిపురుష్ మూవీ ప్రీమియర్ షోను రద్దు చేశారు. ఈ ఫెస్టివల్ జూన్ 7 నుంచి జూన్ 18 వరకూ జరగనున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆదిపురుష్ మూడు స్పెషల్ షోలను ప్లాన్ చేశారు. జూన్ 13న ఆదిపురుష్ తొలి ప్రీమియర్ వేయాల్సి ఉంది.

ఆ తర్వాత జూన్ 15, జూన్ 17వ తేదీల్లోనూ ఇదే ఫెస్టివల్ లో ఆదిపురుష్ ను ప్రదర్శించనున్నారు. అయితే తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం.. ఆదిపురుష్ జూన్ 13 ప్రీమియర్ షోను ట్రిబెకా నిర్వాహకులు రద్దు చేశారు. దీనికి కారణం ఏంటన్నది మాత్రం వెల్లడించలేదు. అయితే మిగతా రెండు షోలు మాత్రం ప్లాన్ ప్రకారమే వేయనున్నట్లు చెప్పారు.

ఆదిపురుష్ మూవీ ప్రపంచవ్యాప్తంగా జూన్ 16న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. టీజర్ సమయంలో ఇందులో వాడిన వీఎఫ్ఎక్స్ పై ట్రోలింగ్ జరిగినా.. ట్రైలర్ ను ఎంతో మెరుగ్గా తీసుకొచ్చి అభిమానుల మనసులు గెలుచుకున్నారు. ఇక తాజాగా మంగళవారం (మే 16) ప్రభాస్ ఓ స్పెషల్ పోస్టర్ ను కూడా అభిమానుల ముందుకు తీసుకొచ్చాడు.

రిలీజ్ డేట్ జూన్ 16గా మరోసారి కన్ఫమ్ చేస్తూ ప్రభాస్ ఈ పోస్టర్ రిలీజ్ చేశాడు. ఓంరౌత్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మైథలాజికల్ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా హిందీతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ కానుంది. కృతి సనన్ ఈ మూవీలో సీతగా నటించింది.

ఇక బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ రావణుడిగా కనిపించాడు. టీ సిరీస్, రెట్రోఫైల్స్ ప్రొడ్యూస్ చేశాయి. బాహుబలితో మొత్తం ఇండియానే ఊపేసిన ప్రభాస్.. మరోసారి ఆదిపురుష్ ద్వారా ఓ పౌరాణిక పాత్రలో నటించాడు. ఇందులో రాముడిగా అతని నటన ఎలా ఉందో చూడటానికి అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం