Adipurush Update: ఆదిపురుష్ టికెట్లు కావాలా? ఒకటి కంటే మరోకటి ఉచితం
Adipurush Update: ఆదిపురుష్ సినిమా టికెట్ల విషయంలో పేటీఎం సంస్థ సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. ఒక్క టికెట్టు రేటుతో రెండు టికెట్లు కొనుగోలు చేసేలా అప్డేట్ చేసింది. అంటే ఒకటి కంటే మరో టికెట్టును ఉచితంగా తీసుకొవచ్చు.
Adipurush Update: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ ట్రైలర్ విడుదలనంతరం సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ట్రైలర్ ప్రేక్షకులను అలరించడమే కాకుండా.. అప్పటి వరకు సినిమాపై ఉన్న నెగిటివిటీని పటాపంచలు చేసింది. ఇప్పుడు సినీ ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఆదిపురుష్ ముందు వరుసలో నిలిచింది.
ఒక్క టికెట్ రేటుతో రెండు టికెట్లు..
ఇదిలా ఉంటే ఆదిరుపురుష్ జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీకి సంబధించిన టికెట్ల విషయంలో పేటీఎం సంస్థ ఆసక్తికరమైన ఆఫర్ ప్రకటించింది. అదేంటంటే ఓ టికెట్ రేటుతో రెండు టికెట్లను బుక్ చేసుకునే అవకాశాన్ని ఇచ్చింది. ఈ విషయాన్ని ఆదిపురుష్ దర్శకుడు ఓం రౌత్ ట్విటర్ వేదికగా పంచుకున్నారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్సే కాకుండా.. సినీ ప్రేక్షకులు కూడా ఫుల్ ఫిదా అవుతున్నారు.
ఆదిపురుష్ మూవీని తొలుత గతేడాది ఆగస్టు 11న విడుదల చేయాలని భావించారు. కానీ సినిమా వీఎఫ్ఎక్స్ పనులు పూర్తికాకపోవడంతో జనవరికి వాయిదా వేశారు. అప్పుడు కూడా ఔట్ పుట్ సరిగ్గా రాకపోవడంతో జూన్ 16న విడుదల చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.
తాజాగా ఈ ట్రైలర్ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. విడుదలైన 24 గంటల్లోనే 70 మిలియన్లకు పైగా వీక్షణలు అందుకుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కలుపుకొని ఈ ట్రైలర్ 24 గంటల్లోనే 70 మిలియన్లకు పైగా వ్యూస్ అందుకుంది. అంతేకాకుండా అన్నీ భాషల్లో కలిపి 10 నిమిషాల్లో లక్ష వ్యూస్‌ను సాధించింది. హిందీలో 5 నిమిషాల్లో, తెలుగులో 9 నిమిషాల్లో లక్ష లైక్స్ సాధించింది. అంతకుముందు ఆర్ఆర్ఆర్ చిత్రం అన్నీ భాషల్లో కలుపుకుని 24 గంటల్లో 55 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించగా.. తాజాగా ఆదిపురుష్ ఆ రికార్డును బద్దలు కొట్టింది.
రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటించగా.. సీతగా బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్ ముఖ్య పాత్రలను పోషించారు. అంతేకాకుండా టీ-సిరీస్, రెట్రోపైల్స్ బ్యానర్లలో భూషన్ కుమార్, క్రిషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేశ్ నాయర్ నిర్మిస్తున్నారు. తన్హాజీ ఫేమ్ ఓం రౌత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సాచేత్ పరంపరా సంగీతాన్ని సమకూరుస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్‌లో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా ఏకకాలంలో విడుదల కానుంది. జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.