Adipurush Trailer Update: ప్రభాస్ ఆదిపురుష్ ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్.. 3డీలో స్పెషల్ స్క్రీనింగ్-prabhas adipurush trailer to be unveiled on may 9 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Prabhas Adipurush Trailer To Be Unveiled On May 9

Adipurush Trailer Update: ప్రభాస్ ఆదిపురుష్ ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్.. 3డీలో స్పెషల్ స్క్రీనింగ్

Maragani Govardhan HT Telugu
May 04, 2023 12:56 PM IST

Adipurush Trailer Update: ప్రభాస్ నటించిన ఆదిపురుష్ ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్ చేసింది చిత్రబృందం. ఈ మూవీ ట్రైలర్‌ను మే 9న విడుదల చేసేందుకు ప్లాన్ చేసింది. అంతేకాకుండా ఫ్యాన్స్ కోసం ట్రైలర్‌ను 3డీలో స్పెషల్ స్క్రీనింగ్‌కు ఏర్పాటు చేయనుంది.

ఆదిపురుష్ ట్రైలర్
ఆదిపురుష్ ట్రైలర్

Adipurush Trailer Update: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ మూవీకి సంబంధించి అప్డేట్లు ఒక్కొక్కటిగా చిత్రబృందం విడుదల చేస్తోంది. ఇటీవలే సీతా దేవి పాత్ర పోషిస్తున్న కృతి సనన్ లుక్స్ రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా సినిమా ట్రైలర్‌కు సంబంధించిన అప్డేట్ వదిలారు. ఆదిపురుష్ ట్రైలర్‌ను మే 9న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. డిజిటల్‌గానే కాకుండా థియేటర్లలోనూ ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.

ఆదిపురుష్ ట్రైలర్‌ను మే 9 సాయంత్రం 5.30 గంటలకు విడుదల చేయనున్నారు. ఏపీ, తెలంగాణాలో 105 థియేటర్లలో స్పెషల్ స్క్రీనింగ్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా ముంబయిలో ఓ పెద్ద ఈవెంట్‌ను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి ఆదిపురుష్ చిత్రబృందం హాజరుకానుంది. ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంటుందని ఈ మూవీ సన్నిహిత వర్గాలు తెలిపాయి. 3 నిమిషాల నిడివి కలిగిన ట్రైలర్ రామాయణం ప్రపంచంలోకి తీసుకెళ్తుందని అంటున్నారు.

అంతకంటే ముందు మే 8న ప్రభాస్ ఫ్యాన్స్ కోసం ఎక్స్‌క్యూజివ్‌గా ఆదిపురుష్ ట్రైలర్ స్పెషల్ 3డీ స్క్రీనింగ్ ఏర్పాటు చేయనున్నారట. గత రెండేళ్లుగా తమకు అండగా నిలిచిన ఫ్యాన్స్ కోసం ఈ నిర్ణయం తీసుకున్నారట. అంతేకాకుండా ఆదిపురుష్ విడుదలపై కొనసాగుతున్న సస్పెన్స్‌పై కూడా క్లారిటీ వచ్చింది. ఈ సినిమాను జూన్ 16నే ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.

రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటించగా.. సీతగా బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్ ముఖ్య పాత్రలను పోషించారు. అంతేకాకుండా టీ-సిరీస్, రెట్రోపైల్స్ బ్యానర్లలో భూషన్ కుమార్, క్రిషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేశ్ నాయర్ నిర్మిస్తున్నారు. తన్హాజీ ఫేమ్ ఓం రౌత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సాచేత్ పరంపరా సంగీతాన్ని సమకూరుస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్‌లో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా ఏకకాలంలో విడుదల కానుంది. జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

IPL_Entry_Point