Adipurush Pre Release Event: ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఇదే - వేదిక ఎక్క‌డంటే-prabhas adipurush pre release event date and venue locked ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Prabhas Adipurush Pre Release Event Date And Venue Locked

Adipurush Pre Release Event: ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఇదే - వేదిక ఎక్క‌డంటే

Nelki Naresh Kumar HT Telugu
May 02, 2023 10:45 AM IST

Adipurush Pre Release Event: ప్ర‌భాస్ హీరోగా ఓంరౌత్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న మైథ‌లాజిక‌ల్ మూవీ ఆదిపురుష్ జూన్ 16న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్‌, వేదిక‌ను ఖ‌రారైన‌ట్లు స‌మాచారం.

 ఆదిపురుష్ మూవీ
ఆదిపురుష్ మూవీ

Adipurush Pre Release Event: ప్ర‌భాస్ (Prabhas) హీరోగా రామాయ‌ణ గాథ ఆధారంగా రూపొందుతోన్న ఆదిపురుష్ జూన్ 16న రిలీజ్ కానుంది. పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో భారీగా క్రేజ్ ఉన్న మూవీ కావ‌డంతో దేశ‌వ్యాప్తంగా ఈ సినిమా ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్స్ నిర్వ‌హించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. కాగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను భారీ ఎత్తున జ‌రుప‌బోతున్న‌ట్లు తెలిసింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్‌తో పాటు వేదిక‌ను ఫైన‌ల్ చేసిన‌ట్లు చెబుతోన్నారు.

జూన్ 3న తిరుప‌తిలో ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌రుగ‌నున్న‌ట్లు చెబుతోన్నారు. ఈ సినిమా ట్రైల‌ర్‌ను మే 9న రిలీజ్ చేయ‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. రామాయ‌ణ గాథ ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమాకు ఓంరౌత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు. ఇందులో ప్ర‌భాస్ రాముడి పాత్ర‌లో క‌నిపించ‌నుండ‌గా, సీత‌గా కృతిస‌న‌న్ (Kritisanon) న‌టిస్తోంది. రావ‌ణాసురుడి పాత్ర‌ను సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) పోషిస్తోన్నాడు.

మోష‌న్‌క్యాప్చ‌ర్, త్రీడీ టెక్నాల‌జీతో దాదాపు ఐదు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో ఆదిపురుష్ మూవీని తెర‌కెక్కిస్తోన్నారు. తొలుత ఈ సినిమాను సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రిలోనే రిలీజ్ చేయాల‌ని అనుకున్నారు.కానీ టీజ‌ర్ రిలీజ్ త‌ర్వాత సినిమాలోని గ్రాఫిక్స్‌, ప్ర‌ధాన పాత్ర‌ధారుల లుక్స్‌పై భారీగా విమ‌ర్శ‌లొచ్చాయి. వీఎఫ్ఎక్స్‌, గ్రాఫిక్స్ మార్పులు చేయాల‌ని నిర్ణ‌యించుకున్న చిత్ర యూనిట్ సినిమాను జూన్ 16కు వాయిదావేశారు.

ఈ గ్రాఫిక్స్ రీ వ‌ర్క్ కోసం అద‌నంగా వంద కోట్ల‌కుపైగా బ‌డ్జెట్‌ను వెచ్చించిన‌ట్లు తెలిసింది. ఈ సినిమాను తెలుగు, హిందీతో పాటు భార‌య‌తీ భాష‌ల‌న్నింటిలో రిలీజ్ చేయ‌బోతున్నారు. ప్ర‌స్తుతం ఆదిపురుష్‌తోపాటు ప్రాజెక్ట్ కే, స‌లార్ సినిమాల్లో న‌టిస్తోన్నాడు ప్ర‌భాస్‌. వీటితో పాటు ద‌ర్శ‌కుడు మారుతితో ఓ సూప‌ర్ నాచుర‌ల్ హార‌ర్ మూవీ చేస్తోన్నాడు.

IPL_Entry_Point