Adipurush Trailer Record: ఆదిపురుష్ ట్రైలర్ సంచలనం.. ఆర్ఆర్ఆర్ రికార్డు బ్రేక్-adipurush trailer record as the prabhas movie garnered over 6 crore view in 24 hours ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Adipurush Trailer Record As The Prabhas Movie Garnered Over 6 Crore View In 24 Hours

Adipurush Trailer Record: ఆదిపురుష్ ట్రైలర్ సంచలనం.. ఆర్ఆర్ఆర్ రికార్డు బ్రేక్

Hari Prasad S HT Telugu
May 10, 2023 06:11 PM IST

Adipurush Trailer Record: ఆదిపురుష్ ట్రైలర్ సంచలనం సృష్టిస్తోంది. ఆర్ఆర్ఆర్ రికార్డు బ్రేక్ చేసేసింది. 24 గంటల్లోనే ఈ ట్రైలర్ కు 8 కోట్లకుపైగా వ్యూస్ రావడం విశేషం.

ఆదిపురుష్ లో ప్రభాస్
ఆదిపురుష్ లో ప్రభాస్

Adipurush Trailer Record: ఆదిపురుష్ మూవీకి ఉన్న క్రేజ్ ఏంటో ఆ సినిమా ట్రైలర్ క్రియేట్ చేసిన రికార్డును బట్టే తెలుస్తోంది. మంగళవారం (మే 9) రిలీజైన ఈ ట్రైలర్ 24 గంటల్లోనే ఆర్ఆర్ఆర్ రికార్డును బ్రేక్ చేసింది. ప్రభాస్ రాముడిగా నటించిన ఆదిపురుష్ జూన్ 16న రిలీజ్ కానుండగా.. తాజాగా వచ్చిన ట్రైలర్ కు అభిమానులు ఫిదా అయిపోతున్నారు.

నిజానికి టీజర్ చూసి చాలా మంది ఇందులోని వీఎఫ్ఎక్స్ ను ట్రోల్ చేసినా.. ట్రైలర్ ను మాత్రం చాలా మెరుగ్గా తీసుకొచ్చారు. దీంతో అన్ని భాషల్లో కలిపి ఆదిపురుష్ ట్రైలర్ కు తొలి 24 గంటల్లోనే 8 కోట్లకుపైగా వ్యూస్ రావడం విశేషం. ఓంరౌత్ డైరెక్ట్ చేసిన ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాతో రామాయణాన్ని ఈ జనరేషన్ కు దగ్గర చేసేలా తీసుకొస్తున్నట్లు డైరెక్టర్ గతంలో చెప్పాడు.

ఈ సినిమా హిందీతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ అవుతోంది. ఈ మూవీ హిందీ ట్రైలర్ కు ఇప్పటికే 5 కోట్లకుపైగా వ్యూస్ రాగా.. తెలుగులో కోటిన్నర, తమిళంలో 75 లక్షల వరకూ వ్యూస్ రావడం విశేషం.

ఇది నా రాముడి కథ అంటూ హనుమంతుడు చెప్పడంతో ట్రైలర్ మెుదలవుతుంది. ఆయన మనిషిగా పుట్టి భగవంతుడు అయిన మహానీయుడు. ఆయన జీవితం ధర్మానికి సన్మార్గానికి నిదర్శనం. ఆయన నామం రాఘవ అంటూ ట్రైలర్లో వాయిస్ ఓవర్ వస్తుంది. నా రాఘవుడి కథే రామాయణం అని చెప్పడంతో స్టోరీ మెుదలవుతోంది. ఆ తర్వాత రావణుడు పర్ణశాలకు వచ్చిన సీన్ చూపించారు. రాముడి ఆగమనం, ఆయోధ్య పరిచయం ఇలా కొనసాగించి చివరికి రామ, రావణ యుద్ధం షాట్లతో ట్రైలర్‌ను ముగించేశారు.

ఈ ట్రైలర్ విజువల్ వండర్ గా కనిపిస్తుంది. ప్రభాస్‌ ఫ్యాన్స్‌(Prabhas Fans) కాలర్‌ ఎగరేసే టైమ్‌ వచ్చినట్టే ఉంది. టీజర్‌తో వచ్చిన నెగెటివిటీ అంతా ట్రైలర్‌తో పోతుంది. ట్రైలర్లో విజువల్స్ బాగా ఉన్నాయి. ప్రభాస్‌ లుక్స్‌(Prabhas Looks) విషయంలో మాత్రం ఫ్యాన్స్ ఖుషీ అయ్యేలా ఉన్నారు. ట్రైలర్‌ చివరి షాట్‌ మాత్రం బాగుంది. శివలింగం ముందు రావణుడు పూజ చేస్తున్న షాట్‌ సూపర్ గా ఉంది. ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.

IPL_Entry_Point

సంబంధిత కథనం