Pushpa 2 Movie Release : పుష్ప 2 సినిమా ఈ ఏడాది విడుదలవుతుందా?-allu arjun pushpa 2 release date may postponed to 2024 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Telugu News  /  Entertainment  /  Allu Arjun Pushpa 2 Release Date May Postponed To 2024

Pushpa 2 Movie Release : పుష్ప 2 సినిమా ఈ ఏడాది విడుదలవుతుందా?

పుష్ప 2లో అల్లు అర్జున్
పుష్ప 2లో అల్లు అర్జున్ (twitter)

Pushpa 2 : అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాను వీలైనంత త్వరగా చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ఈ ఏడాది కోరిక నెరవేరేలా కనిపించడం లేదు. ఈ ఏడాది సినిమా విడుదల కాదని వార్తలు వస్తున్నాయి.

అల్లు అర్జున్ పుష్ప 2(Allu Arjun Pushpa 2) సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 2023లోనే ఈ సినిమా విడుదలవుతుందని అభిమానులు ఎదురుచూస్తున్నారు. కానీ సినిమా విడుదల తేదీ వాయిదా పడే అవకాశం ఉందని అంటున్నారు. ఈ మేరకు కొన్ని మీడియాల్లో కథనం ప్రచురితమైంది. పుష్ప 2 సినిమా(Pushpa 2) విడుదల గురించి చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు . దర్శకుడు సుకుమార్(Director Sukumar) చాలా జాగ్రత్తలు తీసుకుని సినిమా తీస్తున్నందున సహజంగానే ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి 2024లో పుష్ప 2 సినిమా విడుదల కానుందని వినిపిస్తోంది. దీనిపై చిత్ర బృందం నుంచే అధికారిక సమాచారం అందాల్సి ఉంది.

ట్రెండింగ్ వార్తలు

‘పుష్ప’ సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత దాని సీక్వెల్ పై విపరీతమైన హైప్ క్రియేట్ అయ్యింది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. ఇది అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాపై అనేక గాసిప్స్ వినిపిస్తున్నాయి. సీక్వెల్ లో హీరోయిన్ పాత్ర ముగియడం, పుష్పరాజ్(Pushpa Raj) విదేశాలకు వెళ్లడం, స్టార్ హీరోయిన్ ఐటెం డ్యాన్స్ చేయడం ఇలా ఎన్నో గాసిప్స్ ఉన్నాయి. ఈ సినిమాలో పెద్ద పెద్ద స్టార్స్ నటిస్తున్నారు. అల్లు అర్జున్‌తో పాటు రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్, డాలీ ధనంజయ్ ఉన్నారు. షూటింగ్ జోరుగా సాగుతోంది. కొత్త ఆర్టిస్టులు కూడా తారాగణంలోకి వస్తారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో రణవీర్ సింగ్(Ranvir Singh In Pushpa) అతిథి పాత్రలో నటించనున్నాడని సమాచారం. ఈ వార్త విన్న అభిమానులు చాలా సంతోషిస్తున్నారు. కేజీఎఫ్ సినిమా సూపర్ హిట్ అయింది. సెకండ్ పార్ట్ కోసం బాలీవుడ్ హీరో సంజయ్ దత్ ని తీసుకున్నారు. హిందీలో కేజీఎఫ్ 2 హైప్ క్రియేట్ చేయడానికి ఇది కూడా ఓ కారణం. ఇప్పుడు పుష్ప టీమ్ కూడా అదే స్ట్రాటజీని ఫాలో అవుతుందని అంటున్నారు. రణ్‌వీర్‌ సింగ్‌ని ఎంపిక చేసే ఆలోచనలో దర్శకుడు సుకుమార్‌ ఉన్నాడు.

ఎర్రచందనం స్మగ్లింగ్‌తో తెరకెక్కిన చిత్రం పుష్ప. సెకండ్ పార్ట్‌లో కూడా ఇదే అంశం కొనసాగుతుంది. రణ్‌వీర్ సింగ్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడనే వార్త చక్కర్లు కొడుతుంది. ఓ ప్రధాన సన్నివేశంలో అతిథి పాత్రలో కనిపించనున్నాడని టాక్ వినిపిస్తుంది. గతంలో సింబా సినిమాలో పోలీస్‌గా నటించాడు రణ్ వీర్.