Virupaksha Profits: విరూపాక్ష లాభాల్లో సుకుమార్ వాటా ఎంతో తెలుసా?-virupaksha profits make sukumar rich by 6 crores ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Telugu News  /  Entertainment  /  Virupaksha Profits Make Sukumar Rich By 6 Crores

Virupaksha Profits: విరూపాక్ష లాభాల్లో సుకుమార్ వాటా ఎంతో తెలుసా?

విరూపాక్ష మూవీలో సాయి ధరమ్ తేజ్, సంయుక్త
విరూపాక్ష మూవీలో సాయి ధరమ్ తేజ్, సంయుక్త

Virupaksha Profits: విరూపాక్ష లాభాల్లో సుకుమార్ వాటా ఎంతో తెలుసా? ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు రావడంతో నాలుగు రోజుల్లోనే రూ.50 కోట్ల క్లబ్ లో చేరిన విషయం తెలిసిందే.

Virupaksha Profits: టాలీవుడ్ సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన మూవీ విరూపాక్ష. బైక్ యాక్సిడెంట్ తర్వాత అతడు చేసిన తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నాడు. ఈ మిస్టరీ థ్రిల్లర్ మూవీకి అన్ని వైపుల నుంచి పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. నాలుగు రోజుల్లోనే విరూపాక్ష రూ.50 కోట్లకుపైగా వసూలు చేసింది. మరి ఈ సినిమా ద్వారా డైరెక్టర్ సుకుమార్ ఎంత అందుకున్నాడో తెలుసా?

ట్రెండింగ్ వార్తలు

నిజానికి ఈ మూవీకి స్క్రీన్ ప్లే అందించింది సుకుమారే. ఈ మూవీలోని ట్విస్టులకు అతని స్క్రీన్ ప్లేనే బలం చేకూర్చింది. అంతేకాదు మూవీ నిర్మాణంలోనూ అతని నిర్మాణ సంస్థ సుకుమార్ రైటింగ్స్ పాలు పంచుకుంది. నిజానికి ఇందులో అతడు ఎలాంటి పెట్టుబడి పెట్టకపోయినా.. స్క్రీన్ ప్లే అందించడం ద్వారానే సుకుమార్ ఏకంగా రూ.6 కోట్లు వెనకేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఓవైపు డైరెక్షన్ తోపాటు సుకుమార్ రైటింగ్స్ ద్వారా సినిమా నిర్మాణాల్లోనూ ఈ టాలెంటెడ్ డైరెక్టర్ భాగమవుతున్నాడు. ప్రస్తుతం అతడు పుష్ప 2 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. మరోవైపు విరూపాక్ష మూవీకి కార్తీక్ దండు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఇందులో ఫిమేల్ లీడ్ గా సంయుక్త కనిపించింది.

మిగిలిన లాంగ్వేజ్‌ల‌తో పోలిస్తే తెలుగులో మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ జోన‌ర్‌లో సినిమాలు రావ‌డం కాస్త త‌క్కువ అనే చెప్ప‌వ‌చ్చు. అందులోనూ చేత‌బ‌డులు, క్షుద్ర‌పూజ‌లు అనే పాయింట్స్ జోలికి వెళ్లే ప్ర‌య‌త్నం యంగ్ డైరెక్ట‌ర్స్ ఎవ‌రూ చేయ‌లేదు. ఈ రేర్ పాయింట్‌ను ఎంచుకొని తొలి సినిమాతోనే ద‌ర్శ‌కుడిగా వైవిధ్య‌త‌ను చాటుకున్నాడు కార్తిక్ దండు.

ఓ ఊరిలో జ‌రిగే అనూహ్య ప‌రిణామాల‌కు స‌స్పెన్స్‌, థ్రిల్‌, హార‌ర్ ఎలిమెంట్స్‌తో పాటు ఓ రివెంజ్ డ్రామా, ల‌వ్ స్టోరీని అల్లుకుంటూ విరూపాక్ష సినిమాను తెర‌కెక్కించారు. మెయిన్ స్టోరీతో ముడిప‌డిన‌ ఉప‌క‌థ‌లు, స‌ర్‌ప్రైజింగ్ చేసే ట్విస్ట్‌ల‌తో చివ‌రి వ‌ర‌కు సినిమాను ఎంగేజింగ్‌గా న‌డిపించారు.

WhatsApp channel

సంబంధిత కథనం

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.