Virupaksha Collections: యాభై కోట్ల క్ల‌బ్‌లో విరూపాక్ష - నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్‌-virupaksha collections sai dharam tej movie enter 50 crore club ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Virupaksha Collections: యాభై కోట్ల క్ల‌బ్‌లో విరూపాక్ష - నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్‌

Virupaksha Collections: యాభై కోట్ల క్ల‌బ్‌లో విరూపాక్ష - నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్‌

Nelki Naresh Kumar HT Telugu
Apr 25, 2023 12:34 PM IST

Virupaksha Collections: సాయిధ‌ర‌మ్‌తేజ్ హీరోగా న‌టించిన విరూపాక్ష మూవీ యాభై కోట్ల క్ల‌బ్‌లోకి ఎంట‌రైంది. నాలుగు రోజుల్లోనే ఈ ఘ‌న‌త‌ను సొంతం చేసుకొని రికార్డ్ క్రియేట్ చేసింది.

సాయిధ‌ర‌మ్‌తేజ్
సాయిధ‌ర‌మ్‌తేజ్

Virupaksha Collections: సాయిధ‌ర‌మ్‌తేజ్ (Saidharam Tej) హీరోగా న‌టించిన విరూపాక్ష మూవీ యాభై కోట్ల క్ల‌బ్‌లో చేరింది. నాలుగు రోజుల్లోనే ఈ ఘ‌న‌త‌ను ద‌క్కింకుకొన్న‌ది. సోమ‌వారం నాటి వ‌సూళ్ల‌తో ఈ సినిమా యాభై కోట్ల క్ల‌బ్‌లో చేరిన‌ట్లు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. అంతే కాకుండా సోమ‌వారం నాటితో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయిన‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు చెబుతోన్నాయి.

సాయిధ‌ర‌మ్‌తేజ్ కెరీర్‌లోనే హ‌య్యెస్ట్ ఓపెనింగ్స్‌ను రాబ‌ట్టిన మూవీగా విరూపాక్ష నిలిచింది. నాలుగు రోజుల్లో నైజాం ఏరియాలో ఈ సినిమా 12 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన‌ట్లు స‌మాచారం. సీడెడ్‌లో మూడు కోట్ల యాభై ల‌క్ష‌ల‌కుపైగా వ‌సూళ్లు వ‌చ్చిన‌ట్లు తెలిసింది. ఓవ‌ర్‌సీస్‌లోనూ నాలుగుకోట్లకుపైగా క‌లెక్ష‌న్స్‌ను సొంతం చేసుకున్న‌ట్లు చెబుతోన్నారు.

సంయుక్త న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు...

హార‌ర్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో రూపొందిన ఈ సినిమాకు కార్తిక్ దండు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. రుద్ర‌వ‌నం అనే ఊరిలో జ‌రిగే వ‌రుస హ‌త్య‌ల వెన‌కున్న మిస్ట‌రీని సూర్య అనే యువ‌కుడు ఎలా ఛేదించాడ‌న్న‌దే ఈ సినిమా క‌థ‌. సంయుక్త హీరోయిన్‌గా న‌టించింది. నెగెటివ్ షేడ్స్‌లో ఆమె న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు ద‌క్కుతోన్నాయి.

విరూపాక్ష సినిమాకు సుకుమార్ స్క్రీన్‌ప్లేను అందించారు. దాదాపు రెండేళ్ల గ్యాప్ త‌ర్వాత విరూపాక్ష సినిమాతో సాయిధ‌ర‌మ్‌తేజ్ ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు. ఈ సినిమాతో అదిరిపోయే క‌మ్‌బ్యాక్ ఇవ్వ‌డంతో మెగా అభిమానుల్లో ఆనందం వ్య‌క్త‌మ‌వుతోంది. విరూపాక్ష సినిమాలో బ్ర‌హ్మాజీ, సునీల్‌, అజ‌య్‌, రాజీవ్ క‌న‌కాల కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

IPL_Entry_Point