Virupaksha Hindi Release Date: బాలీవుడ్‌లోకి విరూపాక్ష - రిలీజ్ డేట్ చెప్పేసిన సాయిధ‌ర‌మ్‌తేజ్‌-virupaksha hindi version release date locked ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Virupaksha Hindi Release Date: బాలీవుడ్‌లోకి విరూపాక్ష - రిలీజ్ డేట్ చెప్పేసిన సాయిధ‌ర‌మ్‌తేజ్‌

Virupaksha Hindi Release Date: బాలీవుడ్‌లోకి విరూపాక్ష - రిలీజ్ డేట్ చెప్పేసిన సాయిధ‌ర‌మ్‌తేజ్‌

Nelki Naresh Kumar HT Telugu
Apr 25, 2023 05:43 AM IST

Virupaksha Hindi Release Date: తెలుగులో బిగ్గెస్ట్ క‌మ‌ర్షియ‌ల్ హిట్‌గా నిలిచిన విరూపాక్ష సినిమా బాలీవుడ్‌లోనూ రిలీజ్ కాబోతున్న‌ది. హిందీ రిలీజ్ డేట్‌ను సోమ‌వారం సాయిధ‌ర‌మ్‌తేజ్ రివీల్ చేశాడు.

సాయిధ‌ర‌మ్‌తేజ్
సాయిధ‌ర‌మ్‌తేజ్

Virupaksha Hindi Release Date: సాయిధ‌ర‌మ్‌తేజ్ హీరోగా న‌టించిన విరూపాక్ష సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షాన్ని కురిపిస్తోంది. గ‌త శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన ఈ మూవీ మూడు రోజుల్లోనే 44 కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. వీకెండ్‌లోనే నిర్మాత‌లు, డిస్ట్రిబ్యూట‌ర్ల‌ను లాభాల బాట ప‌ట్టించింది. తెలుగు ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తోన్న ఈ సూప‌ర్ హిట్ మూవీ హిందీలోనూ రిలీజ్ కాబోతున్న‌ది. హిందీ వెర్ష‌న్ రిలీజ్ డేట్‌ను సాయిధ‌ర‌మ్‌తేజ్ రివీల్ చేశాడు. సోమ‌వారం ట్విట్ట‌ర్ ద్వారా అభిమానుల‌తో ముచ్చ‌టించాడు సాయిధ‌ర‌మ్‌తేజ్‌.

ఈ సంద‌ర్భంగా బాలీవుడ్‌లో ఈ సినిమాను రిలీజ్ చేస్తారా అని ఓ అభిమాని అడిగిన ప్ర‌శ్న‌కు సాయిధ‌ర‌మ్‌తేజ్ బ‌దులిస్తూ మే 5న హిందీ వెర్ష‌న్‌ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోన్న‌ట్లు పేర్కొన్నాడు. ఇంట గెలిచి ర‌చ్చ గెలుద్దామ‌నే ఆగామ‌ని, అతి త్వ‌ర‌లోనే హిందీతో పాటు అన్ని భాష‌ల్లో విరూపాక్ష సినిమాను రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు పేర్కొన్నాడు.

అంతే కాకుండా విరూపాక్ష సినిమాకు సీక్వెల్ ఉంటుంద‌ని సాయిధ‌ర‌మ్‌తేజ్ క్లారిటీ ఇచ్చాడు. విరూపాక్ష క్లైమాక్స్‌లో సీక్వెల్‌కు సంబంధించిన హింట్ ఇచ్చామ‌ని అన్నాడు. సినిమా విశేషాల‌తో పాటు వ్య‌క్తిగ‌త జీవితంపై అభిమానులు అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు సాయిధ‌ర‌మ్‌తేజ్ ఆన్స‌ర్ ఇచ్చాడు.

త‌మ ఫ్యామిలీ హీరోలు కాకుండా టాలీవుడ్‌లో ర‌వితేజ‌, ప్ర‌భాస్ అంటే ఇష్ట‌మ‌ని సాయిధ‌ర‌మ్‌తేజ్ అన్నాడు. స‌మంత త‌న క్ర‌ష్ అని చెప్పాడు. విరూపాక్ష త‌ర్వాత జ‌యంత్ అనే కొత్త ద‌ర్శ‌కుడితో ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ మూవీ చేస్తోన్న‌ట్లు సాయిధ‌ర‌మ్‌తేజ్ పేర్కొన్నాడు. కాగా హార‌ర్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో రూపొందిన విరూపాక్ష సినిమాకు కార్తిక్ దండు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. అగ్ర ద‌ర్శ‌కుడు సుకుమార్ స్క్రీన్‌ప్లేను అందించాడు. సంయుక్త హీరోయిన్‌గా న‌టించింది.

IPL_Entry_Point