Ravanasura Day 1 Collection: రావ‌ణాసుర ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ - ధ‌మాకా రికార్డ్‌ను బీట్ చేయ‌లేక‌పోయిన ర‌వితేజ‌-ravi teja ravanasura day 1 collections worldwide ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Ravi Teja Ravanasura Day 1 Collections Worldwide

Ravanasura Day 1 Collection: రావ‌ణాసుర ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ - ధ‌మాకా రికార్డ్‌ను బీట్ చేయ‌లేక‌పోయిన ర‌వితేజ‌

Nelki Naresh Kumar HT Telugu
Apr 08, 2023 10:19 AM IST

Ravanasura Day 1 Collection: ర‌వితేజ రావ‌ణాసుర తొలిరోజు మిక్స్‌డ్ టాక్‌తో సంబంధం లేకుండా భారీగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. ఈ సినిమాకు ఫ‌స్ట్ డే వ‌చ్చిన క‌లెక్ష‌న్స్ ఎంతంటే...

ర‌వితేజ రావ‌ణాసుర
ర‌వితేజ రావ‌ణాసుర

Ravanasura Day 1 Collection: రావ‌ణాసుర సినిమాతో శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు మాస్ మ‌హారాజా ర‌వితేజ‌. రివేంజ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ అందుకోవాల‌నే అత‌డి క‌ల తీర‌లేదు. తొలిరోజు ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ ల‌భించింది. అయితే రావ‌ణాసుర‌ ఉన్న బ‌జ్‌ కార‌ణంగా ఫ‌స్ట్ డే ఓపెనింగ్స్‌ను భారీగానే రాబ‌ట్టిన‌ట్లు స‌మాచారం.

వ‌ర‌ల్డ్ వైడ్‌గా శుక్ర‌వారం ఈ సినిమా ఏడు కోట్ల గ్రాస్‌ను మూడు కోట్ల ఎన‌భై ల‌క్ష‌ల‌కుపైగా షేర్‌ను సొంతం చేసుకున్న‌ట్లు ట్రేడ్ వ‌ర్గాల స‌మాచారం. ర‌వితేజ ధ‌మాకా సినిమా తొలిరోజు ప‌ది కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది.

ఆ సినిమాతో పోలిస్తే రావ‌ణాసుర మూడు కోట్ల వ‌ర‌కు త‌క్కువ‌గానే ఓపెనింగ్స్‌ను రాబ‌ట్టిన‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు చెబుతోన్నాయి. మిక్స్‌డ్ టాక్ అందుకు కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. రావ‌ణాసుర సినిమాకు సుధీర్‌వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

త‌న ఫ్యామిలీకి జ‌రిగిన అన్యాయంపై ఓ యువ‌కుడు ఎలా ప్ర‌తీకారం తీర్చుకున్నాడ‌నే పాయింట్‌తో ఈ సినిమాను తెర‌కెక్కించారు. క‌థ‌లో కొత్త‌ద‌నం లేద‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తోన్న నెగెటివ్ షేడ్స్‌లో ర‌వితేజ క్యారెక్ట‌ర్ ఈ సినిమాకు బ‌లంగా నిలుస్తోంది.

అత‌డి యాక్టింగ్‌, కామెడీ టైమింగ్ అభిమానుల‌ను మెప్పిస్తోంది. రావ‌ణాసుర సినిమాలో అను ఇమ్మాన్యుయేల్‌, మేఘా ఆకాష్‌, ఫ‌రియా అబ్దుల్లా, ద‌క్షా న‌గార్క‌ర్‌, పూజిత పొన్నాడ హీరోయిన్లుగా న‌టించారు. సుశాంత్‌తో పాటు జ‌య‌రాం కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

IPL_Entry_Point