Virupaksha Collections: బ్రేక్ ఈవెన్ దిశగా విరూపాక్ష.. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తున్న సాయి తేజ్
Virupaksha Collections: సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన చిత్రం విరూపాక్ష. ఈ సినిమాకు వసూళ్ల వర్షం కురుస్తోంది. ఈ మూవీ రెండో రోజుకు 7.30 కోట్ల వసూళ్లను సాధించింది. సంయుక్త మీనన్ హీరోయిన్‌గా చేసిన ఈ చిత్రం ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Virupaksha Collections: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన సరికొత్త చిత్రం విరూపాక్ష. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. కార్తిక్ దండు దర్శకత్వం వహించిన ఈ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లు కూడా భారీగా వస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన రెండు రోజుల్లో రూ.24 కోట్లకు పైగా గ్రాస్‌ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా తొలి రోజు కంటే కూడా రెండో రోజు ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి.
విరూపాక్ష మూవీకి రెండో రోజున తెలుగు రాష్ట్రాల్లో 5 కోట్ల రేంజ్‌లో షేర్ అందుకుంటుందని అంచనా వేయగా.. ఇది అంచనాలకు మించి రూ.5.80 కోట్ల షేర్‌ను అందుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీకి రూ.7.30 కోట్ల రేంజ్‌లో షేర్‌ను వసూలు చేసి అదరహో అనిపించింది. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా రూ.13.65 కోట్ల షేర్.. 24.60 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. ఓవర్సీస్‌లోనూ ఈ మూవీకి మెరుగైన వసూళ్లు వస్తున్నాయి. రెండు రోజుల్లోనే హాఫ్ మిలియన్ మార్కును అధిగమించింది. తొలి రోజు 2 లక్షల 79 వేల డాలర్లు, రెండో రోజు 2 లక్షల 50 వేల డాలర్ల వసూళ్లు సాధించిన ఈ చిత్రం మొత్తంగా 5 లక్షల 30 వేల డాలర్ల మార్కును అందుకుంది.
విరూపాక్ష మూవీకి 23 కోట్ల షేర్ వస్తే బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశముంది. ఇప్పటికీ దాదాపు రూ.14 కోట్ల వరకు రాగా.. మరో 9.35 కోట్ల షేర్ వసూలు చేస్తే బ్రేక్ ఈవెన్‌ను అందుకోనుంది. ప్రస్తుతం సినిమా టాక్ బట్టి మొదటి వారాంతంలోనే బ్రేక్ ఈవెన్ సాధించనుంది ఈ మూవీ. సినిమాలో సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ పర్ఫార్మెన్స్‌కు మంచి మార్కులు పడుతున్నాయి. సుకుమార్ శిష్యుడైన కార్తిక్ దండు అద్భుతంగా ఆకట్టుకున్నాడు.
ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్‌గా చేసింది. కాంతారా ఫేమ్ అజనీష్ లోక్ నాథ్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై సినిమాను నిర్మించారు. సుకుమార్ ఈ చిత్రానికి స్కీన్ ప్లే అందించారు. కార్తిక్ వర్మ దండు దర్శకత్వం వహించారు. ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.