Virupaksha Teaser: విరూపాక్ష టీజర్ వచ్చేసింది.. సాయి ధరమ్ తేజ్ అదరగొట్టేశాడు-sai dharam tej virupaksha movie teaser out now ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Virupaksha Teaser: విరూపాక్ష టీజర్ వచ్చేసింది.. సాయి ధరమ్ తేజ్ అదరగొట్టేశాడు

Virupaksha Teaser: విరూపాక్ష టీజర్ వచ్చేసింది.. సాయి ధరమ్ తేజ్ అదరగొట్టేశాడు

Maragani Govardhan HT Telugu
Jan 08, 2024 08:07 PM IST

Virupaksha Teaser: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం విరూపాక్ష. తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఏప్రిల్ 21న సినిమా విడుదల కానుంది.

విరూపాక్ష టీజర్ విడుదల
విరూపాక్ష టీజర్ విడుదల

Virupaksha Teaser: టాలీవుడ్ యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కల్యణ్‌తో వినోదాయ సీతమ్ రీమేక్‌లో నటిస్తుండగా.. కొత్త దర్శకుడు కార్తిక్ వర్మ దండు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అదే విరూపాక్ష. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ వీడియో విడుదలైంది. జూనియర్ ఎన్‌టీఆర్ వాయిస్ ఓవర్‌లో ఈ వీడియో ఆకట్టుకుంది. తాజాగా అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది చిత్రబృందం. విరూపాక్ష టీజర్‌ను విడుదల చేసింది.

ఈ టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. విజువల్స్, సౌండ్ ఈ టీజర్‌లో అదరగొట్టాయి. సాయి ధరమ్ తేజ్ చెప్పిన సమస్య ఎక్కడ మొదలవుతుందో పరిష్కారం అక్కడే వెతకాలి. అనే డైలాగ్ బాగుంది. మొత్తానికి ఈ సినిమాతో సాయి ధరమ్ తేజ్ మరో హిట్ ఖాయంలా అనిపిస్తోంది.

విరూపాక్ష టీజర్ విజువల్స్, సౌండ్ అదరగొట్టాయి. థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కినట్లు అర్థమవుతుంది. అంతేకాకుండా విభిన్న జోనర్‌లో ఈ సినిమా రూపొందించారు. కొత్త దర్శకుడు కార్తిక్ వర్మ దండు టేకింగ్ బాగుంది. సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న మొదటి పాన్ ఇండియా చిత్రం ఇదే కావడంతో సినిమాపై అంచనాలు నెలకొననాయి.

ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్‌గా చేసింది. కాంతారా ఫేమ్ అజనీష్ లోక్ నాథ్ ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై సినిమాను నిర్మిస్తున్నారు. సుకుమార్ ఈ చిత్రానికి స్కీన్ ప్లే అందిస్తున్నారు. కార్తిక్ వర్మ దండు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.

సంబంధిత కథనం

టాపిక్