Virupaksha Teaser: విరూపాక్ష టీజర్ చూసిన పవన్ కల్యాణ్.. ఏమన్నాడంటే?-virupaksha teaser to be released tomorrow as the pawan kalyan praises it a day before
Telugu News  /  Entertainment  /  Virupaksha Teaser To Be Released Tomorrow As The Pawan Kalyan Praises It A Day Before
విరూపాక్ష టీజర్ చూస్తున్న పవన్ కల్యాణ్
విరూపాక్ష టీజర్ చూస్తున్న పవన్ కల్యాణ్

Virupaksha Teaser: విరూపాక్ష టీజర్ చూసిన పవన్ కల్యాణ్.. ఏమన్నాడంటే?

28 February 2023, 18:40 ISTHari Prasad S
28 February 2023, 18:40 IST

Virupaksha Teaser: విరూపాక్ష టీజర్ చూశాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న ఈ మూవీ టీజర్ బుధవారం (మార్చి 1) ప్రేక్షకుల ముందుకు రానుంది.

Virupaksha Teaser: మెగా కాంపౌండ్ హీరో, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న మిస్టిక్ థ్రిల్లర్ మూవీ విరూపాక్ష. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ ఎంతో ఆసక్తి రేపింది. ఇక ఇప్పుడీ మూవీ టీజర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్సయింది. బుధవారం (మార్చి 1) విరూపాక్ష టీజర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే దానికి ఒక రోజు ముందే ఈ టీజర్ చూశాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్.

కార్తీక్ దండు డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత బీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో సంయుక్త మేనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఏప్రిల్ 21న పాన్ ఇండియా స్థాయిలో విరూపాక్ష రిలీజ్ కాబోతోంది. తెలుగుతోపాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తుండటం మరో హైలైట్.

అయితే తాజాగా ఈ మూవీ టీజర్ చూసిన పవన్.. చాలా ఆసక్తికరంగా, ఎంగేజింగ్ గా ఉందని అన్నాడు. ఈ మూవీ పెద్ద విజయం సాధించాలని ఆకాంక్షించాడు. ఈ టీజర్ చూడటానికి సాయి ధరమ్ తో కలిసి పవన్ వచ్చాడు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ.. తమ బ్యానర్ లోనే వచ్చి సూపర్ డూపర్ హిట్ అయిన అత్తారింటికి దారేది మూవీ హీరో పవన్ కల్యాణ్ ఈ విరూపాక్ష టీజర్ చూశాడని చెప్పాడు.

"పవన్ కు ఈ టీజర్ ఎంతగానో నచ్చింది. విజువల్స్, బీజీఎం బాగున్నాయని అన్నాడు. సాయి ధరమ్ తోపాటు మొత్తం టీమ్ ను అభినందించాడు. ఈ టీజర్ ను మొదట పవన్ కల్యాణ్ కే చూపించడం చాలా ఆనందంగా ఉంది. పవన్ ప్రశంసలు మాలో కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. ఇప్పటి వరకూ సాయి ధరమ్ చేసిన సినిమాల కంటే భిన్నమైనదీ మూవీ. ఏప్రిల్ 21న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం" అని అన్నాడు.

మరోవైపు సాయి ధరమ్, పవన్ కలిసి వినోదయ సిద్ధం అనే తమిళ మూవీ రీమేక్ లో కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఈ మధ్యే లాంచ్ అయింది. పవన్ ఈ రీమేక్ తోపాటు ఓజీ అనే మరో మూవీలోనూ నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాల కోసం అతడు భారీగా రెమ్యునరేషన్ తీసుకున్నాడు.

సంబంధిత కథనం