Pawan Kalyan remuneration: పవన్ కల్యాణ్‌కు కళ్లు చెదిరే రెమ్యునరేషన్.. టాలీవుడ్‌లోనే టాప్-pawan kalyan remuneration for vinodhaya sitham remake is huge ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Telugu News  /  Entertainment  /  Pawan Kalyan Remuneration For Vinodhaya Sitham Remake Is Huge

Pawan Kalyan remuneration: పవన్ కల్యాణ్‌కు కళ్లు చెదిరే రెమ్యునరేషన్.. టాలీవుడ్‌లోనే టాప్

పవన్ కల్యాణ్-సాయి ధరమ్ తేజ్ చిత్రంలో సముద్ర ఖని
పవన్ కల్యాణ్-సాయి ధరమ్ తేజ్ చిత్రంలో సముద్ర ఖని

Pawan Kalyan remuneration: పవన్ కల్యాణ్‌కు కళ్లు చెదిరే రెమ్యునరేషన్. టాలీవుడ్‌లోనే అత్యధికం ఇది. పవర్ స్టార్ చేస్తున్న తాజా రీమేక్ మూవీ కోసం అతడు భారీగా రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Pawan Kalyan remuneration: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరో రీమేక్ లో నటిస్తున్న విషయం తెలుసు కదా. తమిళంలో 2021లో వచ్చి సూపర్ హిట్ టాక్ కొట్టేసిన వినోదయ సిద్ధం మూవీ ఇప్పుడు తెలుగులో వస్తోంది. ఈ సినిమాలో పవన్ తోపాటు మరో మెగా కాంపౌండ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్నాడు. ఈ మూవీని తమిళంలో డైరెక్ట్ చేసిన సముద్రఖనే తెలుగులోనూ డైరెక్ట్ చేస్తున్నాడు.

ట్రెండింగ్ వార్తలు

ఈ మధ్యే ఈ మూవీని లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ కోసం పవన్ కల్యాణ్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ కు సంబంధించి ఇంట్రెస్టింగ్ వార్తలు వస్తున్నాయి. ఈ మూవీ కోసం పవన్ ఏకంగా రూ.75 కోట్లు తీసుకుంటున్నాడట. కేవలం 30 రోజుల షూటింగ్ కోసం పవన్ ఏకంగా ఇంత మొత్తం తీసుకోవడం విశేషం. అంటే రోజుకు రూ.2.5 కోట్లు వసూలు చేస్తున్నాడు.

టాలీవుడ్ లో ఓ స్టార్ హీరో ఇంత భారీ మొత్తం తీసుకోవడం ఇదే తొలిసారి. పవన్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న ఈ మూవీ భారీగా బిజినెస్ చేస్తుందని భావిస్తున్న నిర్మాతలు.. పెద్ద మొత్తం రెమ్యునరేషన్ గా ఇస్తున్నారు. ఇక ఈ మధ్యే పవన్ మరో మూవీ ఓజీ కూడా లాంచ్ అయిన సంగతి తెలుసు కదా. ఈ సినిమా కోసం కూడా పవన్ భారీగా వసూలు చేస్తున్నాడు.

ఈ సినిమా కోసం పవన్ కు రెమ్యునరేషన్ రూపంలో రూ.79 కోట్లు దక్కనున్నాయి. ఇక ఈ సినిమా రెండు పార్ట్ లుగా వస్తోంది. ఆ లెక్కన రెండు పార్ట్ లు కలిపి పవన్ ఏకంగా రూ.150 నుంచి రూ.160 కోట్లు అందుకోబోతున్నాడు. ఓవైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే వరుస సినిమాలు చేస్తున్న పవన్.. వీటి ద్వారా వచ్చిన డబ్బును తన రాజకీయ పార్టీ జనసేన కోసం కూడా ఖర్చు చేస్తున్నాడు.

గతంలో చాలా తక్కువ మొత్తాలు తీసుకొని సినిమాలు చేసిన పవన్.. క్రమంగా తన మూవీస్ కి క్రేజ్ పెరుగుతుండటంతో రెమ్యునరేషన్ పెంచేస్తున్నాడు. పైగా ఓవైపు పొలిటికల్ ఖర్చులు కూడా పెరిగిపోతుండటం కూడా పవన్ తన రెమ్యునరేషన్ పెంచడానికి మరో కారణంగా కనిపిస్తోంది.

WhatsApp channel

సంబంధిత కథనం

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.