Prabhas Remuneration for Raja Deluxe: రూపాయి రెమ్యునరేషన్ లేకుండా రాజా డీలక్స్ చేస్తున్న ప్రభాస్!
Prabhas Remuneration for Raja Deluxe: రూపాయి రెమ్యునరేషన్ లేకుండా ప్రభాస్ రాజా డీలక్స్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మారుతి డైరెక్షన్ ఈ రాజా డీలక్స్ మూవీ వస్తున్న విషయం తెలిసిందే.
Prabhas Remuneration for Raja Deluxe: ఇప్పడు టాలీవుడ్ లోనే కాదు.. పాన్ ఇండియా లెవల్లో ప్రభాస్ రేంజ్ ఏంటో అందరికీ తెలుసు. అతనితో సినిమా అంటే కోట్లకు కోట్లు కుమ్మరించాల్సిందే అని నిర్మాతలు భావిస్తారు. బాహుబలి తర్వాత అతడు అన్నీ భారీ బడ్జెట్ సినిమాలే చేస్తున్నాడు. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కేలాంటి ప్రతిష్టాత్మక సినిమాలు చేశాడు.
అయితే వీటి మధ్యలో రాజా డీలక్స్ అనే మరో సినిమా కూడా ఉంది. ఈ మూవీ దర్శకుడు మారుతి. చిన్న సినిమాలే అయినా మంచి హిట్లు అందిస్తాడని పేరున్న మారుతితో ప్రభాస్ సినిమా చేయబోతున్నాడన్న వార్తే అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఇప్పుడు మరింత ఆశ్చర్యకరమైన వార్త వచ్చింది. న్యూస్ 18, కొయ్‌మొయ్ సైట్లలో వచ్చిన వార్తల ప్రకారం ఈ సినిమాకు ప్రభాస్ ఒక్క రూపాయి కూడా తీసుకోవడం లేదట.
ప్రభాస్ నిర్ణయం వెనుక కారణమిదీ..
అంత పెద్ద పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ రెమ్యునరేషన్ లేకుండా సినిమా చేయడమంటే నమ్మశక్యం కాని విషయం. కానీ ఈ భారీ ప్రాజెక్టుల మధ్య ఓ చిన్న సినిమా కూడా చేసి తన ఫ్యాన్స్ ను అలరించాలని భావిస్తున్న అతడు.. ఈ మూవీ ద్వారా నిర్మాతలకు లాభాలు ఆర్జించి పెట్టాలని భావిస్తున్నాడట. రెమ్యునరేషన్ లేకపోవడంతో తక్కువ బడ్జెట్ లో సినిమా పూర్తవుతుంది.
అయితే మూవీ రిలీజైన తర్వాత వచ్చే లాభాల్లో ప్రభాస్ తన వాటా తీసుకుంటాడట. అయితే దీనిపై మూవీ యూనిట్ నుంచి ఇంత వరకూ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. రాజా డీలక్స్ పక్కా మారుతి మార్క్ మూవీగా నిలవనుంది. కామెడీతోపాటు రొమాన్స్, హారర్ కథాంశంతో తెరకెక్కుతోంది. ఇంత వరకూ ప్రభాస్ ఓ హారర్ సినిమా చేయలేదు.
ఈ సినిమాలో మాళవికా మోహనన్ తోపాటు నిధి అగర్వాల్, శ్రీలీల నటిస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇక ప్రభాస్ తర్వాతి మూవీ ఆదిపురుష్ ఈ ఏడాది జూన్ 16న రిలీజ్ కాబోతోంది. ఇది కాకుండా సలార్, ప్రాజెక్ట్ కే మూవీల్లో నటిస్తున్నాడు. సందీప్ రెడ్డి వంగాతో కలిసి స్పిరిట్ అనే మూవీ కూడా చేస్తున్నాడు.
సంబంధిత కథనం