Prabhas Adipurush Update: ఆదిపురుష్ వాయిదా రూమ‌ర్స్‌పై క్లారిటీ ఇచ్చిన డైరెక్ట‌ర్‌-prabhas adipurush update director om raut gives clarity on adipurush postpone rumours
Telugu News  /  Entertainment  /  Prabhas Adipurush Update Director Om Raut Gives Clarity On Adipurush Postpone Rumours
ప్ర‌భాస్ ఆదిపురుష్
ప్ర‌భాస్ ఆదిపురుష్

Prabhas Adipurush Update: ఆదిపురుష్ వాయిదా రూమ‌ర్స్‌పై క్లారిటీ ఇచ్చిన డైరెక్ట‌ర్‌

18 January 2023, 7:02 ISTNelki Naresh Kumar
18 January 2023, 7:02 IST

Prabhas Adipurush Update: ప్ర‌భాస్ ఆదిపురుష్ మ‌రోసారి వాయిదాప‌డ‌నున్న‌ట్లు వ‌స్తోన్న వార్త‌ల‌పై ద‌ర్శ‌కుడు క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమా రిలీజ్ డేట్‌లో మార్పు లేద‌ని ప్ర‌క‌టించాడు.

Prabhas Adipurush Update: ప్ర‌భాస్ ఆదిపురుష్ సినిమా మ‌రోసారి వాయిదా ప‌డే అవ‌కాశం ఉన్న‌ట్లుగా చాలా కాలంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ వార్త‌ల‌పై ద‌ర్శ‌కుడు ఓం రౌత్ క్లారిటీ ఇచ్చారు. జూన్ 16నే ఈ సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ట్లు అనౌన్స్‌చేశాడు. త్రీడీలోనూ ఆది పురుష్‌ను రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు మంగ‌ళ‌వారం ట్వీట్ చేశాడు. మ‌రో 150 రోజుల్లో భార‌తీయ పౌరాణిక గాథ‌ను ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న ప్రేక్ష‌కుల‌కు చూపించ‌బోతున్నామ‌ని ఓం రౌత్ ట్వీట్ చేశాడు.

ఆదిపురుష్ వాయిదా పుకార్ల‌కు త‌న ట్వీట్‌తో పుల్‌స్టాప్ పెట్టాడు ఓంరౌత్‌. తొలుత ఈ సినిమాను సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 11న రిలీజ్ చేయాల‌ని భావించారు. కానీ వీఎఫ్ఎక్స్ విష‌యంలో పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు రావ‌డంతో రిలీజ్ డేట్‌ను పోస్ట్‌పోన్ చేశారు. వీఎఫ్ఎక్స్ విష‌యంలో జ‌రిగిన త‌ప్పుల‌ను స‌రిదిద్దుకోవ‌డానికే స‌మ‌యం తీసుకోనున్న‌ట్లు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది.

దాదాపు వంద కోట్ల వ్య‌యంతో విజువ‌ల్ ఎఫెక్ట్స్ ప‌నుల‌న్నీ రీవ‌ర్క్ చేసిన‌ట్లు స‌మాచారం. ముఖ్యంగా ప్ర‌భాస్‌తో పాటు రావణాసురుడిగా న‌టిస్తోన్న సైఫ్ అలీఖాన్ లుక్ విష‌యంలో చాలా విమ‌ర్శ‌లొచ్చాయి. ఆ ట్రోల్స్‌ను దృష్టిలో పెట్టుకొని క్యారెక్ట‌ర్స్ లుక్ విష‌యంలో చాలా మార్పులు చేస్తోన్న‌ట్లు తెలిసింది.

రామాయ‌ణ గాథ ఆధారంగా త్రీడీ మోష‌న్ క్యాప్చ‌ర్ టెక్నాల‌జీలో ఆదిపురుష్ సినిమాను రూపొందిస్తోన్నారు. ఇందులో రాముడిగా ప్ర‌భాస్ న‌టిస్తుండ‌గా జాన‌కిగా కృతిస‌న‌న్ క‌నిపించ‌బోతున్న‌ది. దాదాపు ఐదు వంద‌ల కోట్ల భారీ వ్య‌యంతో రూపొందుతోన్న ఈ సినిమా బాలీవుడ్‌తో పాటు ద‌క్షిణాది భాష‌ల్లో ఒకేసారి రిలీజ్ చేయ‌బోతున్నారు.