Nidhi Agerwal | కండోమ్స్‌కు నిధి అగర్వాల్ ప్రచారం.. నెట్టింట ఓ రేంజ్‌లో ట్రోల్ -tollywood heroin nidhi agerwal promotes condom and trolled by netizens ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nidhi Agerwal | కండోమ్స్‌కు నిధి అగర్వాల్ ప్రచారం.. నెట్టింట ఓ రేంజ్‌లో ట్రోల్

Nidhi Agerwal | కండోమ్స్‌కు నిధి అగర్వాల్ ప్రచారం.. నెట్టింట ఓ రేంజ్‌లో ట్రోల్

HT Telugu Desk HT Telugu
Apr 12, 2022 10:53 AM IST

టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్ ఓ కండోమ్ కంపెనీకి ప్రచారం నిర్వహిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. దీంతో నెటిజన్లు ఆమెను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఇలాంటి వాటికి ప్రచారం నిర్వహించొద్దంటూ ఆమెపై సీరియస్ అవుతున్నారు.

<p>నిధి కండోమ్స్ ప్రచారం</p>
నిధి కండోమ్స్ ప్రచారం (Instagram)

హీరోయిన్ నిధి అగర్వాల్ ఈ మధ్య కాలంలో ఏది చేసిన వివాదానికి గురవుతున్నారు. ఇటీవలే ఓ లిక్కర్ బ్రాండ్‌కు ప్రచారం కల్పించిన ఈ భామ.. తాజాగా మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఈ సారి ఏకంగా కండోమ్స్‌కు ప్రచారం కల్పిస్తున్నారు. ఓ కంపెనీకి చెందిన కండోమ్స్ ఉపయోగించమని సలహా ఇచ్చారు. వాటిని వాడితే మంచి అనుభూతి కలుగుతుందని, లైంగిక సంతృప్తి కలుగుతుందని నిధి అగర్వాల్ ఓ కండోమ్స్ కంపెనీని ప్రమోట్ చేస్తూ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆమె పెట్టిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.

yearly horoscope entry point

కొంతమందైతే నిధి అగర్వాల్‌పై కాస్త శృతి మించిన కామెంట్లు చేస్తున్నారు. అసభ్యకరమైన మెసేజులు పంపుతున్నారు. అంతేకాకండా కండోమ్స్ మీరు ఉపయోగించారా? అంటూ స్పందనలు తెలియజేస్తున్నారు. మరికొంతమంది మంది హీరోయినై ఉండి ఇలాంటి ప్రచారాలు చేస్తారా? అంటూ నిధిపై మండిపడుతున్నారు. ఈ ప్రమోషన్లు చేయకుండా నిషేధించాలంటూ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.

ఇలాంటి వివాదాస్పదమైన ప్రచారాలు చేయడం నిధికి కొత్తేమి కాదు.. గతంలో ఓ లిక్కర్ బ్రాండును ప్రమోట్ చేశారు. అప్పుడు కూడా వ్యతిరేక స్పందనలు వినిపించాయి.. కానీ ఇప్పుడు మాత్రం అంతకంటే ఎక్కువ వ్యతిరేకత వచ్చింది. కురచ దుస్తులను ధరిస్తూ.. ఎక్కువగా ఆమె వస్త్రాధారణపై విమర్శలు వస్తుంటాయి. ఈ విషయంపై ఆమె గతంలో కాస్త ఘాటుగానే స్పందించింది. మరి ఈ సారి కండోమ్స్‌పై ప్రచారం నిర్వహించిన ఈ ముద్దుగుమ్మ.. ఈ సారి ఏ విధంగా రియాక్ట్ అవుతోందో వేచి చూడాలి.

సవ్యసాచి చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్ లాంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా పూరీ జగన్నాథ్, రామ్ కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో ఈ అమ్మడుకు తెలుగులో మంచి పాపులారిటీ వచ్చింది. ఈ ఏడాది సూపర్ స్టార్ మహే‌శ్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా తొలి చిత్రం 'హీరో'లో కథానాయికగా చేసింది. ప్రస్తుతం పవన్ కల్యాణ్ సరసన 'హరిహరవీరమల్లు సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తారు.

 

Whats_app_banner

సంబంధిత కథనం