Fans Want Salaar Update: సలార్ అప్డేట్ కోసం ఫ్యాన్స్ ప్రభాస్ ఆరాటం.. ఫొటో వైరల్-fans eagerly waiting for prabhas salaar movie teaser ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Fans Eagerly Waiting For Prabhas Salaar Movie Teaser

Fans Want Salaar Update: సలార్ అప్డేట్ కోసం ఫ్యాన్స్ ప్రభాస్ ఆరాటం.. ఫొటో వైరల్

Maragani Govardhan HT Telugu
Jan 19, 2023 03:38 PM IST

Fans Want Salaar Update: ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబోలో రానున్న సలార్ చిత్రం షూటింగ్ ప్రస్తుతం జరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమా సినిటోగ్రాఫర్ భువన్ గౌడ్.. మూవీ సెట్స్‌కు సంబంధించిన ఫొటోను షేర్ చేశారు.

సలార్
సలార్

Fans Want Salaar Update: ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ పాన్ఇండియా ప్రాజెక్టు నుంచి అప్డేట్ కోసం అభిమానులతో పాటు సగటు సినీ ప్రేమికులు కూడా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయిన నేపథ్యంలో మూవీ అప్డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందాని చూస్తున్నారు. తాజాగా ఈ చిత్ర సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న భువన గౌడ.. సలార్ సెట్స్ ఫొటోను షేర్ చేశారు.

ఈ ఫొటోకు తోడు సలరా షూటింగ్ జరుగుతోంది అంటూ భువన్ క్యాప్షన్ జోడించారు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతేకాకుండా నెటిజన్లు కూడా విశేషంగా స్పందిస్తున్నారు. అయితే ఈ ఫొటో కంటే కూడా సలార్ టీజర్ కోసం ఎక్కువమంది డిమాండ్ చేస్తున్నారు. టీజర్ ఎప్పుడు విడుదలవుతుంది? అంటూ ప్రశ్నిస్తున్నారు.

టీజర్ ఎప్పుడు విడుదులవుతుందో చెప్పండి బ్రదర్ అంటూ ఓ యూజర్ స్పందించగా.. ఈ ఫొటో చూస్తుంటే నైట్ షూట్ జరుగుతున్నట్లు తెలుస్తోందని మరొకరు కామెంట్ పెట్టారు. త్వరలోనే టీజర్ పెట్టాల్సిందిగా మరొకరు కోరారు.

ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతిహాసన్ హీరోయిన్‌గా చేస్తోంది. డార్లింగ్‌తో ఈ ముద్దుగుమ్మ చేస్తున్న మొదటి చిత్రం ఇదే కావడం విశేషం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు, ఫస్ట్ లుక్ విడుదలై ప్రేక్షకుల్లో అంచనాలను భారీగా పెంచేసింది. తెలుగుతో పాటు కన్నడ, హిందీ, తమిళం, మలయాళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమా విడుదల కానుంది.

హోంబలే ఫిల్మ్స్‌ తెలుగులో నిర్మిస్తున్న మొదటి చిత్రం సలార్. ప్రభాస్ ఈ చిత్రం ప్రధాన పాత్ర పోషిస్తుండగా.. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా కనిపించనున్నారు. ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్‌గా చేస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబరు 28న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ఇండియా స్థాయిలో అలరించనుంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్