Pawan Kalyan Sai Dharam Tej Movie: వినోధ‌య సీత‌మ్ రీమేక్‌కు టార్గెట్ ఫిక్స్ చేసిన ప‌వ‌న్‌-pawan kalyan sai dharam tej vinodhaya sitham remake planning for august release ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Pawan Kalyan Sai Dharam Tej Vinodhaya Sitham Remake Planning For August Release

Pawan Kalyan Sai Dharam Tej Movie: వినోధ‌య సీత‌మ్ రీమేక్‌కు టార్గెట్ ఫిక్స్ చేసిన ప‌వ‌న్‌

Nelki Naresh Kumar HT Telugu
Feb 25, 2023 07:31 AM IST

Pawan Kalyan Sai Dharam Tej Movie: ప‌వ‌న్ క‌ళ్యాణ్, సాయిధరమ్ తేజ్ హీరోలుగా స‌ముద్ర‌ఖ‌ని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఫాంట‌సీ డ్రామా సినిమా ఇటీవ‌లే ప్రారంభ‌మైంది. ఈ సినిమా ఎప్పుడు ప్రేక్ష‌కుల ముందుకు వచ్చే అవకాశం ఉందంటే…

సాయిధ‌ర‌మ్‌తేజ్‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌
సాయిధ‌ర‌మ్‌తేజ్‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

Pawan Kalyan Sai Dharam Tej Movie: ఓ వైపు పాలిటిక్స్‌పై దృష్టిసారిస్తూనే వ‌రుస‌గా సినిమాల‌కు గ్రీన్‌సిగ్న‌ల్ ఇస్తున్నాడు ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్. ప్ర‌స్తుతం నాలుగు సినిమాల్లో న‌టిస్తున్నాడు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా స‌ముద్ర‌ఖ‌ని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఫాంట‌సీ డ్రామా సినిమా ఇటీవ‌లే పూజా కార్య‌క్ర‌మాల‌తో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది.

ఈ సినిమాలో సాయిధ‌ర‌మ్‌తేజ్ మ‌రో హీరోగా న‌టిస్తోన్నాడు.మామా అల్లుళ్ల క‌ల‌యిక‌లో రూపొందుతోన్న తొలి సినిమా ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. త‌మిళంలో విజ‌య‌వంత‌మైన వినోధ‌య సీత‌మ్ ఆధారంగా స‌ముద్ర‌ఖ‌ని ఈ ప్రాజెక్ట్‌ను తెర‌కెక్కిస్తోన్నారు. ఇందులో ప‌వ‌న్ క‌ళ్యాణ్ దేవుడి పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

కాగా ఈసినిమాను ఆగ‌స్ట్‌ నెలలో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌నే యోచ‌న‌లో చిత్ర యూనిట్ ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. జూలైలోగా షూటింగ్ మొత్తాన్ని కంప్లీట్ చేయాల‌ని టార్గెట్‌ సెట్ చేసుకున్న‌ట్లు చెబుతున్నారు. ఈ ఫాంట‌సీ డ్రామా సినిమాకు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కేవ‌లం 20 రోజులు మాత్ర‌మే డేట్స్ కేటాయించిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

అనుకోకుండా ప్ర‌మాదంలో క‌న్నుమూసిన ఓ వ్య‌క్తికి దేవుడు సెకండ్ ఛాన్స్ ఇస్తే ఏం జ‌రిగింద‌నే పాయింట్‌తో ఈ రీమేక్ క‌థ సాగ‌నున్న‌ట్లు స‌మాచారం. ఈ రీమేక్‌కు దేవ‌ర‌, దేవుడు అనే టైటిల్స్ ప‌రిశీల‌న‌ల‌తో ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. వినోధ‌య సీత‌మ్ రీమేక్‌కు అగ్ర ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ స్క్రీన్‌ప్లేతో పాటు సంభాష‌ణ‌ల‌ను అందించ‌బోతున్నారు.

IPL_Entry_Point