Samyuktha Dropped Surname: ఇంటిపేరు తీసేసిన భీమ్లా నాయక్ హీరోయిన్.. ఎందుకో తెలుసా?-bheemla nayak heroine samyuktha menon dropped her surname ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Telugu News  /  Entertainment  /  Bheemla Nayak Heroine Samyuktha Menon Dropped Her Surname

Samyuktha Dropped Surname: ఇంటిపేరు తీసేసిన భీమ్లా నాయక్ హీరోయిన్.. ఎందుకో తెలుసా?

సంయుక్త మీనన్
సంయుక్త మీనన్

Samyuktha Dropped Surname: భీమ్లా నాయక్‌ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన సంయుక్త మీనన్.. తన ఇంటిపేరును తొలగించింది. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన పేరును మార్చుకుంది. ఇందుకు గల కారణాన్ని వివరించింది.

Samyuktha Dropped Surname: భీమ్లా నాయక్ సినిమాతో తెలుగువారికి చేరువైన మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్.. తొలి సినిమాతోనే అదిరిపోయే విజయాన్ని సొంతం చేసుకుంది. ఇందులో రానా సతీమణిగా నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అనంతరం బింబిసారతో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ప్రసుతం ధనుష్‌తో సార్ అనే సినిమాలో నటించింది. తెలుగు, తమిళం రూపొందిన ఈ ద్విభాషా చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సంయుక్త తన జీవితం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సంయుక్తా మీనన్‌గా ఉన్న తన పేరును ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో సంయుక్తగా మార్చుకోడానికి గల కారణాన్ని వివరించారు.

ట్రెండింగ్ వార్తలు

"చిన్నప్పుడు స్కూల్‌లో ఇంటిపేరును రాయమన్నారు. అప్పటి నుంచి మీనన్ అని అలవాటైపోయింది. కానీ సినిమాల్లోకి వచ్చాక నటిగా నాకున్న బాధ్యత తెలిసింది. అప్పటి వరకు పేరు వెనక ఈ తోక ఏంటా అని అనుకున్నాను. ఈ పదం నా పేరు పక్కన ఉండటం సరికాదనిపించింది. పైగా నా తల్లిదండ్రులు ఎప్పుడో విడాకులు తీసుకున్నారు. నాన్న ఇంటి పేరు నా పేరు పక్కన ఉండటం అమ్మకు ఇష్టం లేదు. తన అభిప్రాయాన్ని గౌరవించాలనుకున్నాను. అందుకే పేరును సంయుక్తా మీనన్‌ను సంయుక్తాగా మార్చుకున్నాను." అని తెలిపింది.

ప్రస్తుతం సార్ సినిమాలో నటిస్తున్న సంయుక్త ఈ సినిమా గురించి మాట్లాడారు. ఈ సినిమాలో తన పాత్ర అద్భుతంగా ఉంటుందని, కెరీర్ ఆరంభం నుంచి విభిన్న తరహా పాత్రలను ఎంచుకుంటున్నానని స్పష్టం చేసింది. సార్ సినిమాలో తన పాత్ర అలరిస్తుందని, సెకాండాఫ్‌లో సినిమా ఎమోషనల్‌గా సాగుతుందని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ

ప్రస్తుతం సంయుక్త మీనన్ ధనుష్ సరసన సార్ చిత్రంతో పాటు తెలుగులో మరో చిత్రం చేస్తోంది. అదే సాయి ధరమ్ తేజ్‌తో విరుపాక్ష. ఈ సినిమా కూడా ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది.

WhatsApp channel

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.