Prabhas Fan kills Pawan Fan: త‌మ హీరోను తిట్టాడ‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్‌ను హ‌త్య చేసిన ప్ర‌భాస్ అభిమాని-prabhas fan kills pawan kalyan fan in attili ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Prabhas Fan Kills Pawan Fan: త‌మ హీరోను తిట్టాడ‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్‌ను హ‌త్య చేసిన ప్ర‌భాస్ అభిమాని

Prabhas Fan kills Pawan Fan: త‌మ హీరోను తిట్టాడ‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్‌ను హ‌త్య చేసిన ప్ర‌భాస్ అభిమాని

Nelki Naresh Kumar HT Telugu
Apr 23, 2023 06:26 AM IST

Prabhas Fan kills Pawan Fan: ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, ప్ర‌భాస్ ఫ్యాన్స్ మ‌ధ్య జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో ఓ వ్య‌క్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘ‌ట‌న ఏపీలోని అత్తిలిలో జ‌రిగింది.

మ‌ర్డ‌ర్‌
మ‌ర్డ‌ర్‌

Prabhas Fan kills Pawan Fan: హీరోల‌పై ఉన్న అభిమానం హ‌ద్దులు దాట‌డంతో ఓ వ్య‌క్తి ప్రాణాల‌ను కోల్పోయిన సంఘ‌ట‌న ఏపీలోని అత్తిలిలో జ‌రిగింది. ఏలూరుకు చెందిన హ‌రికుమార్‌, కిషోర్ పెయింట‌ర్స్‌. ఓ బిల్డింగ్ పెయింటింగ్ ప‌నుల నిమిత్తం ఇద్ద‌రు అత్తిలి వ‌చ్చారు. హ‌రికుమార్ ఏలూరులో ప్ర‌భాస్ ఫ్యాన్స్ అసోసియేష‌న్‌కు సెక్ర‌ట‌రీగా ప‌నిచేస్తోన్నాడు.

కిషోర్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమాని. హ‌రికుమార్.. ప్ర‌భాస్ ఫోటోను వాట్స‌స్ స్టేట‌స్‌గా పెట్టుకున్నాడు. అది కిషోర్‌కు న‌చ్చ‌లేదు. ప్ర‌భాస్ ఫొటో తీసేసి ప‌వ‌న్ ఫొటో పెట్టుకోమ‌ని హ‌రికుమార్‌ను కోరాడు. అందుకు హ‌రికుమార్ తిర‌స్క‌రించాడు. దాంతో కిషోర్‌...హ‌రికుమార్‌తో పాటు ప్ర‌భాస్‌ను తిట్ట‌డం మొద‌లుపెట్టాడు.

త‌న అభిమాన హీరోను తిట్టాడ‌నే ఆగ్ర‌హంతో కిషోర్‌పై హ‌రికుమార్ దాడిచేశాడు. సెంట్రింగ్ క‌ర్ర‌తో త‌ల‌పై బ‌లంగా కొట్ట‌డంతో కిషోర్ మృతిచెందాడు. హ‌రికుమార్‌ను ఏలూరు పోలీసులు అరెస్ట్ చేశారు.

IPL_Entry_Point

టాపిక్