virupaksha day 1 collection: విరూపాక్ష ఫస్ట్ డే కలెక్షన్స్ - బాక్సాఫీస్ వద్ద కుమ్మేసిన సాయిధరమ్‌తేజ్ మూవీ
Virupaksha day 1 collection: విరూపాక్ష సినిమా తొలిరోజు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్‌సీస్‌లో వసూళ్ల వర్షాన్ని కురిపించింది. సాయిధరమ్‌తేజ్ కెరీర్‌లో ఫస్ట్ డే హయ్యెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన మూవీగా నిలిచింది.
Virupaksha day 1 collection: విరూపాక్ష సినిమాతో ఘనంగా టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు సాయిధరమ్‌తేజ్. ప్రీమియర్స్ నుంచే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో తొలిరోజు ఈ మూవీ అద్భుతమైన వసూళ్లను దక్కించుకున్నది. తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే విరూపాక్ష ఎనిమిదిన్నర కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.
ట్రెండింగ్ వార్తలు
శుక్రవారం రోజు వరల్డ్ వైడ్‌గా 12 కోట్ల గ్రాస్‌ను, ఆరు కోట్ల నలభై లక్షల షేర్‌ను సొంతం చేసుకున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి. నైజాం ఏరియాలో కలెక్షన్స్‌లో ఈ సినిమా దుమ్ము రేపింది. శుక్రవారం ఒక్కరోజే దాదాపు నైజాం లో విరూపాక్ష సినిమాకు రెండు కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. సీడెడ్‌లో యాభై ఐదు లక్షలు, ఉత్తరాంధ్రలో 60 లక్షల మేర విరూపాక్ష మూవీకి కలెక్షన్స్ వచ్చినట్లు తెలిసింది.
ఓవరాల్‌గా శుక్రవారం రోజు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఎనిమిదిన్నర కోట్ల గ్రాస్ నాలుగు కోట్ల అరవై లక్షలకుపైగా షేర్ దక్కించుకున్నట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 20 కోట్ల వరకు జరిగినట్లు తెలిసింది. తొలిరోజే దాదాపు ఈ సినిమా నలభై శాతం మేర రికవరీ కావడంతో వీకెండ్ లోగా బ్రేక్ ఈవెన్ అవుతోందని టాలీవుడ్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి.
సాయిధరమ్‌తేజ్ కెరీర్‌లో ఫస్ట్ డే హయ్యెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా విరూపాక్ష రికార్డ్ క్రియేట్ చేసింది. హారర్ థ్రిల్లర్ పాయింట్‌కు రివేంజ్ డ్రామాను దర్శకుడు కార్తిక్ దండు ఈ సినిమాను తెరకెక్కించాడు. కథలోని మలుపులతో పాటు సాయిధరమ్‌తేజ్, సంయుక్త యాక్టింగ్ ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్నాయి. ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్‌ప్లేను అందించాడు.