Virupaksha Twitter Review: విరూపాక్ష ట్విట్టర్ రివ్యూ - హార‌ర్ సినిమాతో సాయిధ‌ర‌మ్‌తేజ్‌ హిట్ కొట్టాడా?-virupaksha twitter review us premiere talk about sai dharam tej horror movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Virupaksha Twitter Review: విరూపాక్ష ట్విట్టర్ రివ్యూ - హార‌ర్ సినిమాతో సాయిధ‌ర‌మ్‌తేజ్‌ హిట్ కొట్టాడా?

Virupaksha Twitter Review: విరూపాక్ష ట్విట్టర్ రివ్యూ - హార‌ర్ సినిమాతో సాయిధ‌ర‌మ్‌తేజ్‌ హిట్ కొట్టాడా?

Nelki Naresh Kumar HT Telugu
Apr 21, 2023 06:34 AM IST

Virupaksha Twitter Review: సాయిధ‌ర‌మ్‌తేజ్ హీరోగా న‌టించిన విరూపాక్ష సినిమా శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఈ సినిమా ప్రీమియ‌ర్ టాక్ ఎలా ఉందంటే....

విరూపాక్ష సినిమా
విరూపాక్ష సినిమా

Virupaksha Twitter Review: బైక్ ప్ర‌మాదం కార‌ణంగా దాదాపు ఏడాదిన్న‌ర‌పైనే సినిమాల‌కు దూర‌మ‌య్యాడు మెగా హీరో సాయిధ‌ర‌మ్‌తేజ్‌. ఈ ప్ర‌మాదం నుంచి కోలుకున్న త‌ర్వాత సాయిధ‌ర‌మ్‌తేజ్ న‌టించిన‌ తొలి సినిమా విరూపాక్ష‌.

హార‌ర్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో రూపొందిన ఈ సినిమాకు శుక్ర‌వారం(నేడు) ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఈ సినిమాతో కార్తిక్ దండు ద‌ర్శ‌కుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. అగ్ర ద‌ర్శ‌కుడు సుకుమార్ స్క్రీన్‌ప్లేను అందిస్తూనే బీవీఎస్ఎన్ ప్ర‌సాద్‌తో క‌లిసి విరూపాక్ష సినిమాను నిర్మించారు. సంయుక్త హీరోయిన్‌గా న‌టించింది. విరూపాక్ష‌ ప్రీమియ‌ర్ టాక్ ఎలా ఉందంటే...

రుద్ర‌వ‌నం ఊరిలో...

హార‌ర్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో రూపొందిన ఈ సినిమాకు ఓవ‌ర్‌సీస్ నుంచి పాజిటివ్ టాక్ ల‌భిస్తోంది. రుద్ర‌వ‌నం అనే ఫిక్ష‌న‌ల్ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో బ్లాక్‌మ్యాజిక్, అఘోరాల నేప‌థ్యంలో డిఫ‌రెంట్ పాయింట్‌తో ద‌ర్శ‌కుడు కార్తిక్ దండు ఈ సినిమాను తెర‌కెక్కించిన‌ట్లు చెబుతోన్నారు. రుద్ర‌వ‌నం మిస్ట‌రీని ఛేదించే సూర్య అనే యువ‌కుడిగా ఇంటెన్స్ రోల్‌లో సాయిధ‌ర‌మ్‌తేజ్ యాక్టింగ్ బాగుంద‌ని అంటున్నారు.

ఫ‌స్ట్ హాఫ్‌లో కామెడీ టైమింగ్‌తో ఆక‌ట్టుకోగా, సెకండాఫ్‌లో సీరియ‌స్ రోల్‌లో చ‌క్క‌టి వేరియేష‌న్ చూపించాడ‌ని చెబుతోన్నారు. నందినిగా సంయుక్త యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న రోల్‌లో క‌నిపించింద‌ని అంటున్నారు. సాయిధ‌ర‌మ్‌తేజ్‌, సంయుక్త ల‌వ్ ట్రాక్ మాత్రం బోరింగ్‌గా సాగింద‌నే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఫ‌స్ట్ హాఫ్‌లో అక్క‌డ‌క్క‌డ థ్రిల్ మూవ్‌మెంట్స్ ఉన్నా ఆ టెంపోను పూర్తిగా కొన‌సాగించ‌లేక‌పోయాడ‌ని అంటున్నారు.

సాయిధ‌ర‌మ్ తేజ్ క‌మ్‌బ్యాక్‌

రుద్ర‌వ‌నం ఊరిలో జ‌రిగే హ‌త్య‌ల వెన‌కున్న మిస్ట‌రీని ఛేదించే క్ర‌మంలో ఒక్కో చిక్కుముడిని రివీల్ చేస్తూ సెకండాఫ్‌ను డైరెక్ట‌ర్ ఎంగేజింగ్‌గా తెర‌కెక్కించాడ‌ని అంటున్నారు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌, వీఎఫ్ఎక్స్ తో పాటు ఎంగేజింగ్ స్క్రీన్‌ప్లే ఈ సినిమాకు ప్రాణం పోశాయ‌ని చెబుతోన్నారు. ట్విస్ట్‌ల‌ను డైరెక్ట‌ర్ ఇంట్రెస్టింగ్‌గా రాసుకున్నాడ‌ని నెటిజ‌న్లు అంటున్నారు.

క‌థ‌లో చిన్న చిన్న లోపాలు ఉన్నా ఆడియెన్స్‌ను ఈ సినిమా చివ‌రి వ‌ర‌కు థ్రిల్‌కు లోను చేస్తోంద‌ని ట్వీట్స్ చేస్తున్నారు. సాయిధ‌ర‌మ్‌తేజ్‌కు మంచి క‌మ్‌బ్యాక్ మూవీగా విరూపాక్ష నిలుస్తోంద‌నే కామెంట్స్ వినిపిస్తోన్నాయి. అజ‌య్‌, సునీల్‌, బ్ర‌హ్మాజీతో పాటు ప్ర‌తి పాత్ర‌కు క‌థ‌లో ఇంపార్టెన్స్ ఇస్తూ ద‌ర్శ‌కుడు ఈ సినిమాను తెర‌కెక్కించాడ‌ని అంటున్నారు

IPL_Entry_Point