Sai Dharam Tej on Breakup: అమ్మాయిలంటే భ‌య‌మేస్తుంది - బ్రేక‌ప్‌పై సాయిధ‌ర‌మ్‌తేజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌-sai dharam tej interesting comments on his love breakup in virupaksha promotion ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sai Dharam Tej On Breakup: అమ్మాయిలంటే భ‌య‌మేస్తుంది - బ్రేక‌ప్‌పై సాయిధ‌ర‌మ్‌తేజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌

Sai Dharam Tej on Breakup: అమ్మాయిలంటే భ‌య‌మేస్తుంది - బ్రేక‌ప్‌పై సాయిధ‌ర‌మ్‌తేజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌

Nelki Naresh Kumar HT Telugu
Apr 14, 2023 02:01 PM IST

Sai Dharam Tej on Breakup: విరూపాక్ష‌ప్ర‌మోష‌న్స్‌లో బిజీగా ఉన్న సాయిధ‌ర‌మ్‌తేజ్ త‌న ల‌వ్ బ్రేక‌ప్‌పై ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశాడు. అత‌డి కామెంట్స్ వైర‌ల్‌గా మారాయి.

సాయిధ‌ర‌మ్‌తేజ్
సాయిధ‌ర‌మ్‌తేజ్

sai dharam tej: సాయిధ‌ర‌మ్‌తేజ్ హీరోగా న‌టించిన విరూపాక్ష సినిమా ఏప్రిల్ 21న రిలీజ్ కానుంది. దాదాపు రెండేళ్ల విరామం త‌ర్వాత ఈ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు సాయిధ‌ర‌మ్‌తేజ్‌. మిస్టిక్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన విరూపాక్ష సినిమాకు సుకుమార్ శిష్యుడు కార్తిక్ దండు ద‌ర్శ‌క‌త్వంవ‌హిస్తోన్నాడు. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో బిజీగా సాయిధ‌ర‌మ్‌తేజ్ త‌న‌ ల‌వ్ బ్రేక‌ప్‌పై ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశాడు.

ఓ ఇంట‌ర్వ్యూలో సాయిధ‌ర‌మ్‌తేజ్ మాట్లాడుతూ తాను ప్రేమ‌లో విఫ‌ల‌మైన‌ట్లు వెల్ల‌డించాడు. ల‌వ్ బ్రేక‌ప్ త‌ర్వాత లైఫ్‌లో చాలా సైలెంట్ అయిపోయాన‌ని అన్నాడు. అప్ప‌టి నుంచి అమ్మాయిలంటే భ‌య‌మేస్తుంద‌ని, అందుకే వారికి దూరంగా ఉంటోన్న‌ట్లు చెప్పాడు. ఈ బ్రేక‌ప్ త‌ర్వాత‌ అంజ‌నేయ‌స్వామి భ‌క్తుడిగా మారిపోయిన‌ట్లు తెలిపాడు. బ్రేక‌ప్ ఎవ‌రితో అయ్యింద‌న్న‌ది మాత్రం సాయిధ‌ర‌మ్‌తేజ్ వెల్ల‌డించ‌లేదు.

అమ్మాయి అంటూ ఆమె పేరు చెప్ప‌కుండా స‌మాధానాన్ని దాట‌వేశాడు. ఆ త‌ర్వాత పెళ్లి గురించి మాట్లాడుతూ ఎవ‌రో అడుగుతున్నార‌ని తాను పెళ్లి చేసుకోన‌ని, అన్ని సెట్ అయి క‌రెక్ట్‌ టైమ్ వ‌స్తే త‌ప్ప‌కుండా పెళ్లి క‌బురు వినిపిస్తాన‌ని అన్నాడు. ప్రేమ‌, పెళ్లిపై సాయిధ‌ర‌మ్‌తేజ్ చేసిన కామెంట్స్ వైర‌ల్ అవుతోన్నాయి.

కాగా విరూపాక్ష త‌ర్వాత మామ‌య్య ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌తో ఓ సినిమా చేస్తోన్నాడు సాయిధ‌ర‌మ్‌తేజ్‌. త‌మిళంలో విజ‌య‌వంత‌మైన వినోధ‌య‌సీత‌మ్ రీమేక్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమా జూలై 18న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ది.

IPL_Entry_Point

టాపిక్