Virupaksha Movie Trailer: రుద్ర‌వ‌నం మిస్ట‌రీ - సాయిధ‌ర‌మ్‌తేజ్ విరూపాక్ష ట్రైల‌ర్ రిలీజ్‌-sai dharam tej virupaksha movie trailer unveiled intriguing mystic thriller ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Sai Dharam Tej Virupaksha Movie Trailer Unveiled Intriguing Mystic Thriller

Virupaksha Movie Trailer: రుద్ర‌వ‌నం మిస్ట‌రీ - సాయిధ‌ర‌మ్‌తేజ్ విరూపాక్ష ట్రైల‌ర్ రిలీజ్‌

Nelki Naresh Kumar HT Telugu
Apr 11, 2023 02:18 PM IST

Virupaksha Movie Trailer: సాయిధ‌ర‌మ్‌తేజ్ హీరోగా న‌టించిన విరూపాక్ష సినిమా ఏప్రిల్ 21న వ‌ర‌ల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది. ఈ సినిమా ట్రైల‌ర్‌ను మంగ‌ళ‌వారం రిలీజ్ చేశారు. హార‌ర్‌, స‌స్పెన్స్ అంశాల‌తో ఈ ట్రైల‌ర్ ఉత్కంఠ‌ను పంచుతోంది.

  సాయిధ‌ర‌మ్‌తేజ్  విరూపాక్ష
సాయిధ‌ర‌మ్‌తేజ్ విరూపాక్ష

Virupaksha Movie Trailer: దాదాపు రెండేళ్ల గ్యాప్ త‌ర్వాత విరూపాక్ష సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు మెగా హీరో సాయిధ‌ర‌మ్‌తేజ్‌. మిస్టిక్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమా ట్రైల‌ర్‌ను మంగ‌ళ‌వారం రిలీజ్ చేశారు. ఓ ఊరిలో జ‌రిగే అనూహ్య ప‌రిణామాల‌తో ఆద్యంతం థ్రిల్లింగ్‌గా ట్రైల‌ర్ సాగింది.

నేను పుట్టి పెరిగిన ఊరు వ‌చ్చి ప‌దిహేనేళ్ల‌యింది అంటూ లేడీ వాయిస్ ఓవ‌ర్‌తో ఈ ట్రైల‌ర్ ప్రారంభ‌మైంది. అడ‌వి మ‌ధ్య‌లో ఓ ఊరిలోకి సాయిధ‌ర‌మ్‌తేజ్ అడుగుపెట్టిన‌ట్లుగా చూపించారు.ఆ త‌ర్వాత ఊరిలోకి రాక‌పోక‌లు నిషేదం అంటూ ఓ బోర్డ్ క‌నిపించ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

ఆ ఊరిలో కొన్ని మ‌ర‌ణాలు సంభ‌వించ‌డం, వాటి వెన‌కున్న మిస్ట‌రీని ఛేదించ‌డానికి హీరో సిద్ధ‌మైన‌ట్లుగా ట్రైల‌ర్‌లో చూపించారు. ఈ రుద్ర‌వ‌నాన్ని కాపాడ‌గ‌ల విరూపాక్ష‌కు నువ్వే, మీ స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం నేను వెతుకుతా అంటూట్రైల‌ర్‌లోని డైలాగ్స్ ఆక‌ట్టుకుంటోన్నాయి.

రుద్ర‌వ‌నం అనే ఊరి బ్యాక్‌డ్రాప్‌లో విరూపాక్ష‌ సినిమా సాగుతోన్న‌ట్లు తెలుస్తోంది. దుష్ట‌శ‌క్తుల‌ను ఎదురించి ఓ యువ‌కుడు సాగించిన పోరాటం నేప‌థ్యంలో ద‌ర్శ‌కుడు కార్తిక్ దండు విరూపాక్ష సినిమాను రూపొందించారు. ఈ సినిమాతోనే కార్తిక్ దండు ద‌ర్శ‌కుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్నాడు. విరూపాక్ష సినిమాలో సాయిధ‌ర‌మ్‌తేజ్‌కు జోడీగా సంయుక్త హీరోయిన్‌గా న‌టిస్తోంది.

ఈ సినిమాకు అగ్ర ద‌ర్శ‌కుడు సుకుమార్ స్క్రీన్‌ప్లేను అందిస్తోన్నారు. అంతే కాకుండా నిర్మాత బీవీఎస్ఎన్ ప్ర‌సాద్‌తో క‌లిసి సుకుమార్ స్వ‌యంగా విరూపాక్ష సినిమాను నిర్మించారు. ఏప్రిల్ 21న తెలుగుతో పాటు హిందీ, త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌ల్లో విరూపాక్ష సినిమా రిలీజ్ కానుంది.

IPL_Entry_Point