Shruti Haasan on Salaar: కేజీఎఫ్ 2 కంటే సలార్ పది రెట్లు ఎక్కువగా ఉంటుంది: శృతి హాసన్
Shruti Haasan on Salaar: కేజీఎఫ్ 2 కంటే సలార్ పది రెట్లు ఎక్కువగా ఉంటుందని శృతి హాసన్ ఓ హింట్ ఇచ్చింది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా ఆమె సలార్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది.
Shruti Haasan on Salaar: కేజీఎఫ్ 2 మూవీ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంతటి సంచలనాలు క్రియేట్ చేసిందో తెలుసు కదా. కానీ అలాంటి మూవీ కంటే కూడా పది రెట్లు ఎక్కువగా ఉంటుందట సలార్. ఈ విషయాన్ని అందులో నటించిన శృతి హాసనే వెల్లడించింది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో యాక్టివేటింగ్ ఛేంజ్ ప్యానెల్ గెస్ట్ ఆఫ్ హానర్ గా ఆమె హాజరైంది.
ఈ సందర్భంగా ఇండస్ట్రీలో లింగ భేదం గురించి మాట్లాడిన ఆమె.. తన నెక్ట్స్ మూవీ సలార్ పై కూడా స్పందించింది. ప్రభాస్, ప్రశాంత్ నీల్ గురించి మాట్లాడింది. "ప్రశాంత్ నీల్ ఇంతకుముందు సినిమా చూసే ఉంటారు. హీరో ఉన్నాడు. అతని స్టోరీ ఉంది. కానీ దాని చుట్టూ ఉండేదే ఆ పాత్రను, స్టోరీని నిర్మిస్తుంది. అందులో ప్రతి ఒక్కరికీ తమదైన స్పేస్ ఉంటుంది" అని శృతి చెప్పింది.
ప్రేక్షకుల నాడి పట్టుకునేలా ప్రశాంత్ నీల్.. ఓ కొత్త ప్రపంచాలను, పాత్రను క్రియేట్ చేస్తాడని ఆమె కొనియాడింది. "కేజీఎఫ్ 2లో మరిచిపోయిన ఓ తండ్రికి కూడా స్టోరీలో చోటు కల్పించడం నాకు నచ్చింది. ప్రశాంత్ ఇలాంటి ప్రపంచాలను క్రియేట్ చేస్తాడు. అందరికీ కనెక్ట్ అయ్యేలా అతడు క్రియేట్ చేసే ఈ ప్రపంచాలు, పాత్రల వల్లే కేజీఎఫ్ ఇంత పెద్ద సక్సెస్ సాధించిందని అనుకుంటున్నాను. సలార్ లోనూ అలాంటివే ఉన్నాయి. అంతకు మించే ఉంటాయి" అని శృతి హాసన్ స్పష్టం చేసింది.
సలార్ లో నటించడాన్ని తాను ఎంజాయ్ చేసినట్లు కూడా ఆమె చెప్పింది. "సలార్ విషయంలో ప్రశాంత్ సర్, ప్రభాస్ లకు నేను క్రెడిట్ ఇస్తాను. వాళ్లు సలహాలను స్వీకరిస్తారు. వాళ్లతో నేను చాలా ఓపెన్ గా మాట్లాడేదాన్ని" అని శృతి తెలిపింది. సలార్ భారీ బడ్జెట్ మూవీ. ఈ మూవీ సెప్టెంబర్ లో రిలీజ్ కాబోతోంది. కేజీఎఫ్ 2 తర్వాత ప్రశాంత్ నీల్ నుంచి వస్తున్న మూవీ కావడం, ప్రభాస్ లీడ్ రోల్ లో నటించడం ఈ మూవీపై భారీ హైప్ క్రియేట్ అయ్యేలా చేసింది.
సంబంధిత కథనం