Salaar Teaser: ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు డ‌బుల్ ట్రీట్ - ఆదిపురుష్ రిలీజ్ రోజే స‌లార్ టీజ‌ర్ రానుందా?-prabhas salaar movie teaser release date locked
Telugu News  /  Entertainment  /  Prabhas Salaar Movie Teaser Release Date Locked
ప్ర‌భాస్ స‌లార్
ప్ర‌భాస్ స‌లార్

Salaar Teaser: ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు డ‌బుల్ ట్రీట్ - ఆదిపురుష్ రిలీజ్ రోజే స‌లార్ టీజ‌ర్ రానుందా?

26 May 2023, 13:27 ISTHT Telugu Desk
26 May 2023, 13:27 IST

Salaar Teaser: ప్ర‌భాస్ స‌లార్ టీజ‌ర్ రిలీజ్ డేట్‌పై ఓ క్లారిటీ వ‌చ్చిన‌ట్లు టాలీవుడ్‌లో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ టీజ‌ర్ ఎప్పుడు రిలీజ్ కానుందంటే...

Salaar Teaser: ఫ్యాన్స్‌కు డ‌బుల్ ట్రీట్ ఇచ్చేందుకు ప్ర‌భాస్ (Prabhas) రెడీ అవుతోన్నాడు. స‌లార్ మూవీ టీజ‌ర్ రిలీజ్ డేట్‌ను ఖ‌రారు చేసిన‌ట్లు తెలిసింది. ఆదిపురుష్ (Adipurush) రిలీజ్ రోజే స‌లార్ టీజ‌ర్‌ను విడుద‌ల‌చేయ‌బోతున్న‌ట్లు తెలిసింది. ఆదిపురుష్ సినిమా జూన్ 16న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. అదే రోజు స‌లార్ టీజ‌ర్‌ను రిలీజ్‌ చేసేందుకు స‌న్నాహాలు చేయ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఆదిపురుష్ రిలీజ్ అవుతోన్న అన్ని థియేట‌ర్స్‌లో స‌లార్ టీజ‌ర్ స్క్రీనింగ్ ఉంటుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. త్వ‌ర‌లోనే ఈ టీజ‌ర్ రిలీజ్ డేట్‌పై ఓ క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

స‌లార్ మూవీకి కేజీఎఫ్ ఫేమ్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు. దాదాపు రెండు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో గ్యాంగ్‌స్ట‌ర్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ మూవీ రూపొందుతోంది. ఇందులో ప్ర‌భాస్ రూత్‌లెస్ గ్యాంగ్‌స్ట‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

సెప్టెంబ‌ర్ 28న వ‌ర‌ల్డ్‌వైడ్‌గా ఈ మూవీ రిలీజ్ కానుంది. ఇందులో మ‌ల‌యాళ హీరో పృథ్వీరాజ్ సుకుమార‌న్ విల‌న్‌గా న‌టిస్తోన్నాడు. శృతిహాస‌న్‌, జ‌గ‌ప‌తిబాబు కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తోన్నారు. స‌లార్ సినిమాకు విజ‌య్ కిర‌గందూర్ నిర్మిస్తోన్నారు. స‌లార్‌కు పార్ట్ 2 కూడా ఉంటుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

ప్ర‌స్తుతం స‌లార్‌తో పాటు ప్రాజెక్ట్ కే మూవీ చేస్తోన్నాడు ప్ర‌భాస్‌. సైంటిఫిక్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతోన్న ఈ మూవీకి నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు. ప్రాజెక్ట్ కేతో పాటు మారుతి ద‌ర్శ‌క‌త్వంలో సూప‌ర్ నాచుర‌ల్ థ్రిల్ల‌ర్ మూవీతో ప్ర‌భాస్ బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాలు వ‌చ్చే ఏడాది రిలీజ్ కానున్నాయి.