Shruti Haasan Hollywood Movie: హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్న శృతిహాస‌న్‌-shruti haasan to make hollywood debut with mark rowley the eye movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Shruti Haasan Hollywood Movie: హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్న శృతిహాస‌న్‌

Shruti Haasan Hollywood Movie: హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్న శృతిహాస‌న్‌

Shruti Haasan Hollywood Movie: క‌మ‌ల్ హాస‌న్‌ త‌న‌య శృతిహాస‌న్ హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ది. గ్రీక్‌, ఇంగ్లీష్ భాష‌ల్లో ఓ సినిమా చేస్తోంది. ఆ సినిమా ఏదంటే....

శృతిహాస‌న్

Shruti Haasan Hollywood Movie: ప్రియాంక చోప్రా, దీపికా ప‌డుకోన్‌తో పాటు ప‌లువురు ఇండియ‌న్ హీరోయిన్లు హాలీవుడ్ సిల్వ‌ర్ స్క్రీన్‌పై మెరిశారు. తాజాగా వారి బాట‌లో క‌మ‌ల్ త‌న‌య శృతిహాస‌న్ అడుగులు వేయ‌బోతున్న‌ది. హాలీవుడ్ సినిమాలో న‌టిస్తోంది. ది ఐ పేరుతో గ్రీక్‌, ఇంగ్లీష్ భాష‌ల్లో ఓ సైక‌లాజిక్ థ్రిల్ల‌ర్ సినిమా తెర‌కెక్కుతోంది.

ఇందులో స్కాటిష్ యాక్ట‌ర్ మార్క్ రౌలే హీరోగా న‌టిస్తోండ‌గా శృతిహాస‌న్ హీరోయిన్‌గా క‌నిపించ‌బోతున్న‌ది. ఈ సినిమాలో శృతి హాస‌న్ విధ‌వ‌రాలి పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. పెళ్లైనా కొద్ది నెల‌ల్లోనే భ‌ర్త‌కు దూర‌మైన విడోయ‌ర్‌గా ఛాలెంజింగ్‌గా ఆమె రోల్ సాగుతుంద‌ని స‌మాచారం.

త‌న భ‌ర్త మ‌ర‌ణించిన ఐస్‌లాండ్‌కు ఒంట‌రిగా ప్ర‌యాణ‌మైన ఆమె జీవితంలో చోటు చేసుకున్న అనూహ్య ప‌రిణామాల‌తో ఈసినిమా రూపుదిద్దుకోనున్న‌ట్లు స‌మాచారం.

1980 బ్యాక్‌డ్రాప్‌లో ఈ సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ సినిమా తెర‌కెక్క‌నున్న‌ట్లు స‌మాచారం. ఈ సినిమాకు డ్రాఫ్నే ష్నోమ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోంది. ఎమిలీ కార్ల‌న్ స్క్రీన్‌ప్లేను స‌మ‌కూర్చుతోంది. ఈ నెల‌లోనే ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లుకానున్న‌ట్లు తెలిసింది. ఈ సినిమా షూటింగ్ కోస‌మే ఇటీవ‌లే శృతిహాస‌న్ గ్రీస్‌కు వెళ్లిన‌ట్లు చెబుతున్నారు.

ప్ర‌స్తుతం ప్ర‌భాస్ హీరోగా న‌టిస్తోన్న స‌లార్ సినిమాలో శృతిహాస‌న్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. గ్యాంగ్‌స్ట‌ర్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో శృతిహాస‌న్ జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ది.

తెలుగులో చిరంజీవి 154, బాల‌కృష్ణ 107 సినిమాల్లో హీరోయిన్‌గా న‌టిస్తోంది శృతిహాస‌న్‌. ఈ రెండు సినిమాలు సంక్రాంతికి రిలీజ్ కానున్నాయి. మ‌రోవైపు డూడుల్ ఆర్టిస్ట్ శంత‌ను హ‌జారికాతో ప్రేమ‌లో ఉంది శృతిహాస‌న్ ఈ ఏడాది వీరు పెళ్లి చేసుకోబోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.