తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Project K-kamal Haasan : ప్రభాస్ 'ప్రాజెక్టు కె'లో విలన్​గా కమల్ హాసన్.. ఇందులో నిజమేంత?

Project K-Kamal Haasan : ప్రభాస్ 'ప్రాజెక్టు కె'లో విలన్​గా కమల్ హాసన్.. ఇందులో నిజమేంత?

Anand Sai HT Telugu

31 May 2023, 9:40 IST

    • Project K-Kamal Haasan : 'ప్రాజెక్ట్ కె' టీమ్‌లో కమల్ హాసన్ చేరినట్లుగా తెలుస్తోంది. ఈ వార్త విన్న అభిమానులు చాలా సంతోషిస్తున్నారు. అయితే ఇందులో కమల్ హాసన్ విలన్ అని ప్రచారం జరుగుతుంది.
ప్రభాస్ ప్రాజెక్ట్ కె
ప్రభాస్ ప్రాజెక్ట్ కె

ప్రభాస్ ప్రాజెక్ట్ కె

ప్రభాస్ 'ప్రాజెక్ట్ కె'(Prabhas Project K) పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు నాగ్ అశ్విన్(Nag Ashwin) సినిమాలో ప్రభాస్ నటిస్తుండటంతో అభిమానుల్లో సహజంగానే ఆసక్తి నెలకొంది. బాలీవుడ్ నటి దీపికా పదుకొణె(Deepika Padukone), ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా అప్‌డేట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Heeramandi 2: హీరామండి వెబ్ సిరీస్‍ రెండో సీజన్ వస్తుందా? డైరెక్టర్, యాక్టర్ ఏం చెప్పారంటే..

OTT Web Series: నేహా శర్మ పాపులర్ వెబ్ సిరీస్ మూడో సీజన్ వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ డేట్ ఖరారు

Devara Fear Song: దేవర నుంచి వచ్చేసిన ఫియర్ సాంగ్.. పవర్‌ఫుల్‍గా ఫస్ట్ పాట: చూసేయండి

Adivi Sesh: హనీమూన్ ఎక్స్‌ప్రెస్ వదిలిన అడవి శేష్.. అన్నపూర్ణ ఏడెకరాల ప్రాంగణంలో అప్డేట్

ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. కమల్ హాసన్(Kamal Haasan) 'ప్రాజెక్ట్ కె'లో నటించనున్నట్లు ప్రచారం జరుగుతుంది. కమల్ హాసన్ చాలా భాషల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. ఆయన నటించిన ‘విక్రమ్‌’ చిత్రం గతేడాది విడుదలై సూపర్‌ హిట్‌ అయింది. ఇప్పుడు 'ప్రాజెక్ట్ కె' టీమ్‌లో చేరాడని అంటున్నారు. ఈ వార్త విన్న అభిమానులు చాలా సంతోషిస్తున్నారు.

అయితే ప్రాజెక్ట్ కె(Project K)లో కమల్ హాసన్ విలన్ గా నటించనున్నాడని.. కొంతమంది ప్రచారం చేస్తున్నారు. ఈ సినిమా కోసం ఆయన భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు కూడా చెబుతున్నారు. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన లేదు. ఈ సినిమాలో కమల్ హాసన్ పాత్ర పవర్ ఫుల్ గా ఉండబోతుందని అంటున్నారు. అయితే ఆయన విలన్‌గా నటించడం అనుమానమే అని కొందరి వాదిస్తున్నారు.

ఎందుకంటే.. ఇప్పటికే 'ప్రాజెక్ట్ కె' 70 శాతం షూటింగ్‌ పూర్తయింది. ఇంత ఆలస్యమైనా విలన్ సెట్‌లోకి రావడం ఎలా సాధ్యమన్నది చాలా మంది ప్రశ్న. ఈ సినిమా కోసం కేవలం 20 రోజులు మాత్రమే కమల్ హాసన్ కాల్షీట్ ఇచ్చాడని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఒక వేళ 20 రోజులే డేట్స్ ఇస్తే.. ఏదైనా అతిథి పాత్రలో కమల్ కనిపించనున్నాడు.

ప్రభాస్, దీపికా పదుకొనే(prabhas deepika padukone film) జంటగా నటిస్తున్న 'ప్రాజెక్ట్ K' చిత్రాన్ని జనవరి 12, 2024న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం పేర్కొంది. దీనికి సంబంధించి పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. అయితే ఈ లెక్క.. రివర్స్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. షూటింగ్ ఆలస్యమైతే.. విడుదల తేదీ కూడా మారనుంది. కొన్ని రోజుల కిందట అమితాబ్ బచ్చన్(amitabh bachchan) గాయపడ్డాడు. ఆయన కోలుకోవడం ఆలస్యమవడంతో సినిమా పనులు ఆలస్యమయ్యాయి. దీంతో ' ప్రాజెక్ట్ K ' సినిమా అనుకున్న తేదీకి విడుదల అవడం కష్టమేనని అంటున్నారు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం