Sai Pallavi New Movie : సాయిపల్లవి కొత్త సినిమా.. శివ కార్తికేయన్ హీరో, కమల్ హాసన్ ప్రొడ్యూసర్!
Kamal Haasan : శివకార్తికేయన్ హీరోగా వస్తున్న చిత్రంలో సాయి పల్లవి నటిస్తోంది. ఈ సినిమాను కమల్ హాసన్ నిర్మిస్తున్నాడు. షూటింగ్ కోసం చిత్ర బృందం ప్లాన్ చేసింది.
నటి సాయి పల్లవి(Sai Pallavi) ప్రతిసారీ ప్రత్యేకమైన కథ, పాత్రలను ఎంచుకుంటుంది. ఇప్పుడు తమిళ సినీ నటుడు శివకార్తికేయన్(Siva Karthikeyan)తో కొత్త సినిమాలో నటించనుంది. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా తీసిన ఫోటోలు వైరల్‌గా మారాయి. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ పెట్టలేదు. ప్రస్తుతం వర్కింగ్ టైటిల్ 'SK 21' అని పిలుస్తున్నారు. ఈ చిత్రానికి కమల్ హాసన్(Kamal Haasan) పెట్టుబడి పెడుతున్నట్టుగా తెలుస్తోంది. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్..., రాజ్ కమల్ ఇంటర్నేషనల్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
‘ఎస్‌కే 21’ సినిమా(SK 21 Cinema) ప్రారంభోత్సవం సందర్భంగా చిత్రబృందం అంతా హాజరయ్యారు. కమల్ హాసన్ రాక అందరినీ ఆనందపరిచింది. శివకార్తియన్, హీరోయిన్ సాయి పల్లవికి కమల్ హాసన్ శుభాకాంక్షలు తెలిపాడు. ఈ సినిమాపై అభిమానుల్లో చాలా అంచనాలు ఉన్నాయి. రాజ్‌కుమార్ పెరియసామి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. జి.వి. ప్రకాష్ సంగీత దర్శకత్వం, సిహెచ్. సాయి సినిమాటోగ్రఫికి పని చేస్తున్నారు. కమల్‌హాసన్, ఆర్.మహేంద్రన్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి.
మేజర్ లాంటి విజయవంతమైన చిత్రంతో తెలుగులోకి అడుగుపెట్టిన సోనీ పిక్చర్స్(Sony Pictures) మరోసారి దేశం గర్వించే వీరుల కథతో ఎస్‌కే 21ను నిర్మిస్తోంది. ఈ సినిమా షూటింగ్ కాశ్మీర్‌లో రెండు నెలలపాటు జరగనుంది.
ఇక సాయి పల్లవి చేతిలో ప్రస్తుతం శివ కార్తికేయన్(Sai Pallavi-Siva Karthikeyan)తో చేస్తోన్న తమిళ సినిమా ఒకటే ఉంది. కథ నచ్చితేనే చేస్తాననే ఉద్దేశంతో సాయి పల్లవి ఉన్నట్టుగా తెలుస్తోంది. నివిన్ పౌలీతో మరో సినిమా చేయడానికి రెడీ అవుతోందని సమాచారం. నేరుగా తెలుగు సినిమాతో ఇక్కడి ఆడియన్స్ కి మాత్రం ఇప్పట్లో కనిపించేలా లేదు.
శివ కార్తికేయన్ సినిమాలకు కోలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంటుంది. రెమో లాంటి సినిమాలతో తెలుగు అభిమానులను కూడా సంపాదించుకున్నాడు. ఇటీవలే జాతిరత్నాలు(jathi ratnalu) దర్శకుడు అనుదీప్ తో ప్రిన్స్ సినిమా చేశాడు. తమిళ, తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. శివ కార్తికేయన్, అదితీ శంకర్ నటించిన మహా వీరుడు చిత్రం జూలైలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మడోన్ అశ్విన్ దర్శకత్వం వహించగా.. శాంతి టాకీస్ పతాకంపై అరుణ్ విశ్వ నిర్మించారు. జూలై 14న విడులకు సిద్ధమవుతుంది.