SK20 | అనుదీప్-శివ కార్తీకేయన్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?-siva kartikeyan and anupdeep kv movie release date fix ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sk20 | అనుదీప్-శివ కార్తీకేయన్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

SK20 | అనుదీప్-శివ కార్తీకేయన్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

Maragani Govardhan HT Telugu
May 31, 2022 08:02 AM IST

కోలీవుడ్ హీరో శివ కార్తీకేయన్.. జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కేవీతో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించింది చిత్రబృందం. వినాయక చవితి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది.

శివ కార్తీకేయన్-అనుదీప్
శివ కార్తీకేయన్-అనుదీప్ (Twitter)

'జాతి రత్నాలు' చిత్రంతో తెలుగులో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు అనుదీప్ కేవీ. క్లీన్ కామెడీతో పుల్ లెంగ్త్ ఎంటర్టైన్మెంట్ అందించిన ఈ దర్శకుడు తన తదుపరి చిత్రాన్ని కోలీవుడ్ హీరో శివకార్తీకేయన్‌తో చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. #SK20 పేరుతో వస్తున్న ఈ సినిమాలో మరియా హీరోయిన్‌గా చేస్తోంది. తాజాగా చిత్రబృందం ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో తెలియజేసింది.

"డాన్ సినిమా సూపర్ సక్సెస్ అయినందుకు #SK20 టీమ్ శివకార్తీకేయన్‌కు శుభాకాంక్షలు తెలుపుతోంది. అనుదీప్ కేవీ దర్శకత్వంలో శివకార్తీకేయన్, మారియ, సత్యరాజ్ తదితరులు నటించిన #SK20 సినిమాను ఆగస్టు 31న విడుదల చేయనున్నట్లు ప్రకటిస్తున్నాం. వినాయక చవితి సందర్భంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం." అని చిత్రబృందం సోషల్ మీడియాలో పంచుకుంది.

ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా తమిళంతో పాటు తెలుగులోనూ ఏక కాలంలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ పేర్కొన్నారు. ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోందని, ఫస్ట్ లుక్, తదితర అప్డేట్లను త్వరలోనే ప్రకటిస్తామని స్పష్టం చేశారు.

ఈ సినిమాలో శివకార్తీకేయన్ సరసన, ఉక్రెయిన్ భామ మారియ నటిస్తోంది. సురేశ్ ప్రొడక్షన్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్, శాంతి టాకీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. తమన్ ఈ మూవీకి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్ర టైటిల్‌ను త్వరలోనే ప్రకటించనుంది చిత్రబృందం. రెమో, డాక్టర్, డాన్ లాంటి డబ్బింగ్ చిత్రాలతో శివ కార్తీకేయన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితులయ్యారు.

 

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్