AR Rahman Trolled: భార్యను తమిళంలోనే మాట్లాడాలన్న రెహమాన్.. దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు-ar rahman trolled for telling her wife to speak in tamil ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ar Rahman Trolled: భార్యను తమిళంలోనే మాట్లాడాలన్న రెహమాన్.. దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

AR Rahman Trolled: భార్యను తమిళంలోనే మాట్లాడాలన్న రెహమాన్.. దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

Hari Prasad S HT Telugu
Apr 26, 2023 07:55 PM IST

AR Rahman Trolled: భార్యను తమిళంలోనే మాట్లాడాలన్న రెహమాన్‌ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. నువ్వు ఈ స్థాయికి చేరింది హిందీ ఇండస్ట్రీ వల్లే అన్నది గుర్తు పెట్టుకో అని వాళ్లు రెహమాన్ కు క్లాస్ పీకడం విశేషం.

ఏఆర్ రెహమాన్
ఏఆర్ రెహమాన్ (Mohammed Aleemuddin )

AR Rahman Trolled: తమిళులకు భాషపై ఎంతో మక్కువ. వాళ్లు తమ భాషను ఎంతగానో గౌరవిస్తారు. ఎక్కడికెళ్లినా తమిళంలోనే మాట్లాడాలని అనుకుంటారు. దీనికి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ కూడా అతీతుడు కాదు. అతడు చాలాసార్లు తమిళం పట్ల తనకున్న ఇష్టాన్ని చాటుకున్నాడు. అయితే తాజాగా మరోసారి అలాంటి ప్రయత్నమే చేసిన అతన్ని నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

వికటన్ సినిమా అవార్డ్స్ వేడుకల్లో పాల్గొన్న రెహమాన్.. వేదికపై తన భార్యతో కలిసి అవార్డు అందుకున్నాడు. తర్వాత తమిళంలో మాట్లాడాడు. ఈ సమయంలో పక్కనే ఉన్న అతని భార్య సైరా బానును కూడా మాట్లాడాల్సిందిగా కోరగా.. ఆమె ఇంగ్లిష్ లో మాట్లాడబోయింది. దీంతో మధ్యలో జోక్యం చేసుకున్న రెహమాన్.. హిందీలో కాదు తమిళంలోనే మాట్లాడాలంటూ ఆమెకు నవ్వుతూ చెప్పాడు.

అయితే తాను తమిళం అంత అనర్గళంగా మాట్లాడలేనని చెప్పింది. సైరా తర్వాత ఇంగ్లిష్ లో మాట్లాడింది. అయితే దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. నువ్వు హిందీ ఇండస్ట్రీ వల్లే ఈ స్థాయికి ఎదిగావన్న విషయం గుర్తుంచుకో అని వాళ్లు రెహమాన్ కు క్లాస్ పీకారు. సౌత్ ఇండస్ట్రీతోపాటు రెహమాన్ బాలీవుడ్ లోనూ ఎన్నో హిట్స్ అందుకున్నాడు.

హిందీలో రంగీలా, తాళ్, దిల్‌సే, స్వదేశ్, రంగ్ దే బసంతి, సంజూ, తమాషాలాంటి ఎన్నో హిట్ మూవీస్ కి మ్యూజిక్ అందించాడు. ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ నార్త్ ఆడియెన్స్ రెహమాన్ ను టార్గెట్ చేశారు. రెహమాన్ లాంటి వ్యక్తి.. భాష, ప్రాంతంలాంటి వాటికి అతీతంగా ఎందుకు ఉండలేడు.. అతని భార్య ఆమెకు నచ్చిన భాష ఎందుకు మాట్లడకూడదు అని ప్రశ్నించారు.

హిందీ ఆడియెన్స్ వల్లే ఈ స్థాయికి ఎదిగి.. ఇప్పుడెందుకు అంత ఆత్మనూన్యత అని మరో యూజర్ ప్రశ్నించాడు. బ్రిటీష్ వాడు వదిలి వెళ్లి ఇంగ్లిష్ మాట్లాడితే తప్పు లేదు కానీ.. మన హిందీని మాత్రం ఎందుకలా అవమానిస్తున్నారు అని ఇంకో యూజర్ అన్నాడు.

Whats_app_banner

సంబంధిత కథనం