AR Rahman on Oscars: చెత్త సినిమాలను ఆస్కార్స్‌కి పంపిస్తున్నారు.. రెహమాన్ సంచలన కామెంట్స్
AR Rahman on Oscars: చెత్త సినిమాలను ఆస్కార్స్‌కి పంపిస్తున్నారు అంటూ ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంచలన కామెంట్స్ చేశాడు. ఈసారి ఇండియాకు రెండు అవార్డులు వచ్చిన నేపథ్యంలో అతని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
AR Rahman on Oscars: ఏఆర్ రెహమాన్.. భారతదేశం గర్వించదగిన మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడు. రెండు ఆస్కార్స్ గెలిచిన ఏకైక భారతీయుడు. అయితే అతడు ఆ అవార్డులు గెలిచింది మాత్రం బ్రిటిష్ ప్రొడక్షన్ అయిన స్లమ్‌డాగ్ మిలియనీర్ మూవీ కోసం. అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పుడు ఆస్కార్స్ ఎంట్రీలపై ఘాటు కామెంట్స్ చేశాడు.
ట్రెండింగ్ వార్తలు
ముఖ్యంగా ఈసారి ఇండియన్ ప్రొడక్షన్ కు చెందిన ఓ సినిమా, మరో డాక్యుమెంటరీకి అవార్డులు వచ్చిన నేపథ్యంలో రెహమాన్ కామెంట్స్ చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేశాయి. నాటు నాటు పాటతోపాటు గునీత్ మోంగా డాక్యుమెంటరీ ది ఎలిఫెంట్ విస్పరర్స్ లకు ఆస్కార్స్ వచ్చిన విషయం తెలిసిందే. అయినా ఇండియా నుంచి ఆస్కార్స్ కు వెళ్తున్న ఎంట్రీలపై రెహమాన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.
ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రెహమాన్ చెత్త సినిమాలను ఆస్కార్స్ కు పంపిస్తున్నారని అన్నాడు. "కొన్నిసార్లు ఆస్కార్స్ కు మన సినిమాలు వెళ్తున్నాయి. కానీ అవార్డు గెలవడం లేదు. చెత్త సినిమాలను ఆస్కార్స్ కు పంపిస్తున్నారు. అలా చేయొద్దని నేను చెబుతున్నాను. మనం అవతలి వ్యక్తిలా ఆలోచించాలి. ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే నేను ఓ పాశ్చాత్య దేశస్థుడిలా ఆలోచించాలి. అక్కడ ఏం జరుగుతుందో తెలియాలంటే మనలా ఆలోచించాలి" అని రెహమాన్ అన్నాడు.
ఈసారి ఆస్కార్స్ కు ఇండియా తరఫున అధికారిక ఎంట్రీగా ఛెల్లో షో అనే గుజరాతీ మూవీ వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా నిరాశ పరిచింది. ఇక ఆర్ఆర్ఆర్ మూవీ మాత్రం డైరెక్ట్ ఎంట్రీ సంపాదించింది. ఈ మూవీలోని నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డు గెలిచింది. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ సినిమా, పాటగా రికార్డు క్రియేట్ చేసింది.
సంబంధిత కథనం
టాపిక్