The Elephant Whisperers wins Oscar: భారతీయ షార్ట్ ఫిల్మ్‌కు ఆస్కార్.. సరికొత్త చరిత్ర-indian documentary short film the elephant whisperers wins oscar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  The Elephant Whisperers Wins Oscar: భారతీయ షార్ట్ ఫిల్మ్‌కు ఆస్కార్.. సరికొత్త చరిత్ర

The Elephant Whisperers wins Oscar: భారతీయ షార్ట్ ఫిల్మ్‌కు ఆస్కార్.. సరికొత్త చరిత్ర

The Elephant Whisperers wins Oscar: 95వ ఆస్కార్ అవార్డుల్లో భారతీయ షార్ట్ ఫిల్మ్ ఆస్కార్ లభించింది. ది ఎలిఫెంట్ విస్పర్స్ అనే డాక్యూమెంటరీ షార్ట్ ఫిల్మ్‌కు బెస్ట్ డాక్యూమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ఆస్కార్ లభించింది.

ది ఎలిఫెంట్ విస్పర్స్‌కు ఆస్కార్ అవార్డు

The Elephant Whisperers wins Oscar: ఆస్కార్ అవార్డుల్లో భారత్ చరిత్ర సృష్టించింది. 95వ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవంలో భారత్‌కు చెందిన ది ఎలిఫెంట్ విస్పర్స్ అనే షార్ట్ ఫిల్మ్‌కు ఆస్కార్ అవార్డు లభించింది. బెస్ట్ డాక్యూమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో పురస్కారాన్ని సొంతం చేసుకుంది. ఈ డాక్యూమెంటరీ షార్ట్ ఫిల్మ్‌ను కార్తికి గోన్ స్లేవ్స్ దర్శకత్వం వహించారు. ఇండో-అమెరికన్ తరఫున నామినేట్ అయిన ఈ షార్ట్ ఫిల్మ్‌కు గునీత్ మోంగా నిర్మాతగా వ్యవహరించారు. ఈ షార్ట్ ఫిల్మ్‌కు నిర్మాతలుగా వ్యవహరించిన కార్తికి, గునీత్ మోంగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

ది ఎలిఫెంట్ విస్పర్స్ షార్ట్ ఫిల్మ్ ప్రధానంగా సౌత్ ఇండియాలోని బొమన్, బెల్లి అనే దంపతుల గురించి ఉంటుంది. వారు తమ జీవితాలను రఘు అనే అనాథ ఏనుగును చూసుకోడానికి, దాన్ని పోషించడానికి అంకితం చేస్తారు. మానవులు, జంతువుల మధ్య కుటుంబ బంధాల గురించి ఈ షార్ట్ ఫిల్మ్ వివరిస్తుంది. కార్తికి గోన్సాల్వేస్ ఈ చిత్రాన్ని అందంగా తెరకెక్కించారు.

ది ఎలిఫెంట్ విస్పర్స్ కాకుండా భారత్ నుంచి రెండు ఆస్కార్‌కు నామినేట్ అయ్యాయి. ఆల్ దట్ అనే భ్రీథ్స్ బెస్ట్ డాక్యూమెంటరీ విభాగంలో నామినేట్ కాగా.. ఆర్ఆర్ఆర్ సినిమలోని నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేషన్‌ను అందుకుంది. అయితే ఆల్ దట్ భ్రీథ్స్ అనే డాక్యూమెంటరీకి ఆస్కార్ అవార్డు రాలేదు.

95వ అకాడమీ అవార్డులు భారతీయులకు గుర్తుండిపోతుంది. మూడు ఆస్కార్ నామినేషన్లతో పాటు ప్రముఖ కోలీవుడ్ సూర్య ఈ సారి ఆస్కార్ జ్యూరీ సభ్యుడిగా ఉన్నారు. ఆయన కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇదే సమంయలో దీపికా పదుకొణె ఆస్కార్ ప్రెజెంటర్‌గా ఎంపికయ్యారు. దీంతో అకాడమీ అవార్డు అందించిన మూడో తారగా గుర్తింపు తెచ్చుకుంది.