Harbhajan Raina Dances on Naatu Naatu: నాటు నాటు పాట‌కు స్టెప్పులేసిన హ‌ర్భ‌జ‌న్, రైనా - వీడియో వైర‌ల్‌-legend league cricket harbhajan raina dances on naatu naatu song video viral ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Harbhajan Raina Dances On Naatu Naatu: నాటు నాటు పాట‌కు స్టెప్పులేసిన హ‌ర్భ‌జ‌న్, రైనా - వీడియో వైర‌ల్‌

Harbhajan Raina Dances on Naatu Naatu: నాటు నాటు పాట‌కు స్టెప్పులేసిన హ‌ర్భ‌జ‌న్, రైనా - వీడియో వైర‌ల్‌

Nelki Naresh Kumar HT Telugu
Mar 16, 2023 09:55 AM IST

Harbhajan Raina Dances on Naatu Naatu: టీమ్ ఇండియా మాజీ క్రికెట‌ర్లు హ‌ర్భ‌జ‌న్‌సింగ్‌, రైనా క‌లిసి ఆర్‌ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట‌కు స్టెప్పులేశారు. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

హ‌ర్భ‌జ‌న్‌సింగ్‌, రైనా
హ‌ర్భ‌జ‌న్‌సింగ్‌, రైనా

Harbhajan Raina Dances on Naatu Naatu: టీమ్ ఇండియా మాజీ క్రికెట‌ర్లు హ‌ర్భ‌జ‌న్ సింగ్‌, సురేష్ రైనా నాటు నాటు పాట‌కు క‌లిసి స్టెప్పులేశారు. ప్ర‌స్తుతం హార్భ‌జ‌న్‌, రైనా లెజెండ్స్ లీగ్ క్రికెట్ ఆడుతోన్నారు. ఇండియా మ‌హ‌రాజాస్ టీమ్‌కు ప్రాతినిథ్యం వ‌హిస్తోన్నారు. ఈ లీగ్‌లో భాగంగా బుధ‌వారం ఇండియా మ‌హ‌రాజాస్‌, వ‌ర‌ల్డ్ జెయింట్స్ మ‌ధ్య మ్యాచ్ జ‌రిగింది.

ఈ మ్యాచ్‌లో స్టేడియంలోనే హ‌ర్భ‌జ‌న్‌, రైనా నాటు నాటు పాట‌కు డ్యాన్స్ చేశారు. వీర‌ద్ద‌రు క‌లిసి నాటు నాటుకు అదిరిపోయే స్టెప్పులు వేసిన వీడియోను లెజెండ్స్ లీగ్ ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. క్రికెట్ ఫ్యాన్స్‌కు హ‌ర్భ‌జ‌న్‌, రైనా క‌లిసి ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందించార‌ని నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తోన్నారు.

ఇద్ద‌రి డ్యాన్స్ బాగుందంటూ మ‌రో నెటిజ‌న్ పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌లో వ‌ర‌ల్డ్ జెయింట్స్ చేతిలో ఇండియా మ‌హ‌రాజాస్ టీమ్ ఓట‌మి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా మ‌హ‌రాజాస్ టీమ్ 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్లు న‌ష్ట‌పోయి 136 ప‌రుగులు చేసింది. సురేష్ రైనా 41 బాల్స్‌లో మూడు సిక్స‌ర్లు, రెండు ఫోర్ల‌తో 49 ర‌న్స్ చేసి టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు.

గేల్ (57 ర‌న్స్‌) మెరుపుల‌తో ఈ టార్గెట్‌ను వ‌ర‌ల్డ్ జెయింట్స్ సింపుల్‌గా ఛేదించింది. బౌలింగ్‌లో మెరిసిన రైనా ఒక వికెట్ తీసుకున్నాడు. హ‌ర్భ‌జ‌న్‌కు ఓ వికెట్ ద‌క్కింది.

WhatsApp channel

టాపిక్