Telugu Web Series Release In May: ఈ నెల‌లో రిలీజ్ కానున్న తెలుగు వెబ్‌సిరీస్‌లు ఇవే - వీటిపై ఓ లుక్కేయండి-newsense to dead pixels upcoming telugu web series release in may 2023 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Newsense To Dead Pixels Upcoming Telugu Web Series Release In May 2023

Telugu Web Series Release In May: ఈ నెల‌లో రిలీజ్ కానున్న తెలుగు వెబ్‌సిరీస్‌లు ఇవే - వీటిపై ఓ లుక్కేయండి

Nelki Naresh Kumar HT Telugu
May 05, 2023 09:01 AM IST

Telugu Web Series Releases In May: డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌ల‌తో రూపొందిన తెలుగు వెబ్‌సిరీస్‌లు ఈ నెల‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాయి. ఆ సిరీస్‌లు ఏవంటే...

న్యూసెన్స్ వెబ్‌సిరీస్
న్యూసెన్స్ వెబ్‌సిరీస్

న్యూసెన్స్ - ఆహా ఓటీటీ

న‌వ‌దీప్‌, బిందుమాధ‌వి (Bindu Madhavi) ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తోన్న న్యూ సెన్స్ వెబ్‌సిరీస్ ఆహా ఓటీటీ లో (Aha OTT) మే 12 నుంచి స్ట్రీమింగ్ కానుంది. మీడియా బ్యాక్‌డ్రాప్‌లో మెసేజ్ ఓరియెంటెడ్ క‌థాంశంతో తెర‌కెక్కుతోన్న ఈ సిరీస్‌కు శ్రీ ప్ర‌వీణ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు.

టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ సిరీస్‌ను నిర్మిస్తోంది. ఎలాంటి దాప‌రికాలు లేకుండా నిజాల్ని వెల్ల‌డించే క్ర‌మంలో జ‌ర్న‌లిస్ట్‌లు ఎదుర్కొనే సంఘ‌ర్ష‌ణ‌ను ఈ సిరీస్‌లో చూపించ‌బోతున్నారు. యాంగ‌ర్‌టేల్స్ త‌ర్వాత బిందుమాధ‌వి న‌టిస్తోన్న వెబ్ సిరీస్ ఇది. 1990-2000 బ్యాక్‌డ్రాప్‌లో మ‌ద‌న‌ప‌ల్లె ఏరియాలోని ప్రెస్‌క్ల‌బ్ నేప‌థ్యంలో ఈ సిరీస్‌ను తెర‌కెక్కించారు.

డెడ్‌పిక్సెల్ - డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్

నిహారిక కొణిదెల‌ (Niharika Konidela), సాయిరోన‌క్‌, హ‌ర్ష చెముడు కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తోన్న వెబ్‌సిరీస్ డెడ్ పిక్సెల్స్‌. ఓ వీడియో గేమ్‌కు అడిక్ట్‌గా మారిన కొంద‌రు యువ‌తీయువ‌కుల జీవితాల నేప‌థ్యంలో కామెడీ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ సిరీస్ మే 19న డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో (Disney Plus Hotstar) స్ట్రీమింగ్ కానుంది.

ఈ సిరీస్‌కు ఆదిత్య మండ‌ల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు. డెడ్ పిక్సెల్స్ వెబ్ సిరీస్ ద్వారా చాలా రోజుల గ్యాప్‌ త‌ర్వాత మ‌ళ్లీ తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ది నిహారిక కొణిదెల‌. ఇందులో గాయ‌త్రి అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ క్యారెక్ట‌ర్‌లో న‌టిస్తోంది.

త్వ‌ర‌లోనే విడుద‌ల‌కాబోతున్న మ‌రికొన్ని సిరీస్‌లు ఏవంటే...

సేవ్ ది టైగ‌ర్స్ త‌ర్వాత ద‌ర్శ‌కుడు మ‌హి.వి.రాఘ‌వ్ క్రియేట‌ర్‌గా సైతాన్ పేరుతో ఓ వెబ్‌సిరీస్ రూపొందుతోంది. హార‌ర్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో రూపొందుతోన్న ఈ సిరీస్‌లో కామ‌క్షి భాస్క‌ర్ల ప్ర‌ధాన పాత్ర‌ను పోషిస్తోంది. త్వ‌ర‌లోనే డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.

అంజ‌లి ముఖ్య పాత్ర‌లో న‌టిస్తోన్న బ‌హిష్క‌ర‌ణ వెబ్‌సిరీస్ జీ5 ఓటీటీ లో స్ట్రీమింగ్ కాబోతున్న‌ది. ఈ సిరీస్ షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకున్న‌ది. జూన్ లేదా జూలైలో ఈ సిరీస్ రిలీజ్ కానున్న‌ట్లుతెలిసింది.

త్రిష బృందా వెబ్‌సిరీస్‌కు కూడా మ‌రికొద్ది రోజుల్లో తెలుగు ఆడియెన్స్ ముందుకు రాబోతున్న‌ట్లు స‌మాచారం. ఈ సిరీస్‌కు సూర్య వంగాల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.