Chiyan Vikarm Injured: కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్‌కు ప్రమాదం.. ఆసుపత్రిలో చేరిక-chiyan vikram met with accident ribs broken in thangalaan reharsal ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Chiyan Vikarm Injured: కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్‌కు ప్రమాదం.. ఆసుపత్రిలో చేరిక

Chiyan Vikarm Injured: కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్‌కు ప్రమాదం.. ఆసుపత్రిలో చేరిక

Maragani Govardhan HT Telugu
May 03, 2023 01:36 PM IST

Chiyan Vikarm Injured: కోలీవుడ్ నటుడు చియాన్ విక్రమ్ ప్రమాదానికి గురయ్యారు. పా రంజిత్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న తంగళాన్ మూవీ షూట్ కోసం రిహార్సల్ చేస్తున్న సమయంలో ఆయన గాయపడినట్లు తెలుస్తోంది.

తంగాళన్ చిత్రంలో హీరో విక్రమ్
తంగాళన్ చిత్రంలో హీరో విక్రమ్

Chiyan Vikarm Injured: కోలీవుడ్ హీరో చియాన్ విక్రమ్ ఇటీవల పొన్నియిన్ సెల్వన్ చిత్రంతో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం పా రంజిత్ దర్శకత్వంలో తంగళన్ అనే సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ మూవీ షూటింగ్‌లో విక్రమ్ గాయపడినట్లు తెలుస్తోంది. ఆయన పక్కటెముకలు విరిగాయని, ప్రస్తుతం ఆయనను తరలించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. విక్రమ్ గాయపడంతో కొన్ని రోజుల పాటు తంగళన్ షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఈ సినిమాను ప్రముఖ తమిళ నిర్మాత జ్ఞాన్‌వెల్ రాజా నిర్మిస్తున్నారు. పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. విక్రమ్ సరసన మాళవిక మోహన్, పార్వతి హీరోయిన్లుగా చేస్తుండగా.. పశుపతి, హరి, బ్రిటీష్ నటుడు డేనియల్ కాల్డాగిరోన్ నటిస్తున్నారు.

గతేడాది ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే విక్రమ్ బర్త్ డే సందర్భంగా తంగళన్ మూవీ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో విక్రమ్ లుక్‌కు విభిన్నంగా ఉంది. రగెడ్‌ లుక్‌తో సినీ ప్రేమికులను ఆశ్చర్యపరిచారు. నిజంగా ఇది విక్రమేనా? అనేంతగా అందరూ నోరెళ్లబెట్టేసేలా షాక్‌కు గురిచేశారు.

ఈ మూవీ షూటింగ్‌లో గాయపడిన విక్రమ్‌ను చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. పక్కటెముకలు విరిగినట్లు తెలుస్తోంది. అయితే గాయాలు తీవ్రంగా తగిలినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై వైద్యుల్ త్వరలో అప్డేట్ ఇవ్వనున్నారు. తంగళన్ షూట్ కోసం రిహార్సల్ చేస్తున్న సమయంలో విక్రమ్ గాయపడినట్లు తెలుస్తోంది.

IPL_Entry_Point

టాపిక్