Kamal Haasan and Prithviraj on Kantara: ఈ ఏడాది అత్యుత్తమ సినిమా కాంతారా: కమల్‌ హాసన్‌-kamal haasan and prithviraj sukumaran on kantara says this movie blew their minds ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Kamal Haasan And Prithviraj Sukumaran On Kantara Says This Movie Blew Their Minds

Kamal Haasan and Prithviraj on Kantara: ఈ ఏడాది అత్యుత్తమ సినిమా కాంతారా: కమల్‌ హాసన్‌

HT Telugu Desk HT Telugu
Dec 13, 2022 09:58 PM IST

Kamal Haasan and Prithviraj on Kantara: ఈ ఏడాది అత్యుత్తమ సినిమా కాంతారా అని అన్నారు తమిళ, మలయాళ సూపర్‌ స్టార్లు కమల్‌ హాసన్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌. ఈ సినిమా సెలబ్రిటీ అభిమానుల జాబితాలో మరో ఇద్దరు చేరారు.

కాంతారా మూవీలోని ఓ సీన్
కాంతారా మూవీలోని ఓ సీన్

Kamal Haasan and Prithviraj on Kantara: కాంతారా మూవీ థియేటర్లలో సంచలనం సృష్టించి ఓటీటీలోకి వచ్చిన తర్వాత కూడా ఈ సినిమాపై ప్రశంసల వర్షం ఆగడం లేదు. ముఖ్యంగా ఎంతో మంది సెలబ్రిటీలు ఈ మూవీ అభిమానుల జాబితాలో చేరుతున్నారు. ఇన్నాళ్లూ ఎవరూ పెద్దగా పట్టించుకోని కన్నడ ఫిల్మ్‌ ఇండస్ట్రీ నుంచి ఈ ఏడాది వచ్చిన కేజీఎఫ్‌ 2, కాంతారా సినిమాలు పెను సంచలనం సృష్టించాయి.

ఈ రెండు సినిమాలతో అసలు ఇన్నాళ్లూ కన్నడ సినిమా ఇండస్ట్రీపై అందరిలో ఉన్న అభిప్రాయం పూర్తిగా మారిపోయింది. ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు ఈ సినిమాపై ప్రశంసలు కురిపించగా.. తాజాగా తమిళ సూపర్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌, మలయాళ స్టార్‌ యాక్టర్‌ పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కూడా కాంతారా ఫ్యాన్స్‌గా మారిపోయారు. ఈ ఏటి మేటి సినిమా అంటూ పొగడుతున్నారు.

ఫిల్మ్‌ కంపానియన్‌తో మాట్లాడిన సందర్భంగా కమల్‌ హాసన్‌.. ఈ కాంతారాపై స్పందించాడు. 2022లో వచ్చిన సినిమాలు ఇండియన్‌ సినిమాను ఎలా మార్చేశాయన్న అంశంపై కమల్ మాట్లాడాడు. ఈ ఏడాది అత్యుత్తమ సినిమా కాంతారా తన సినిమా మెదడుపై ఎంతో ప్రభావం చూపిందని కమల్‌ అన్నాడు.

"కాంతారా ఓ మంచి ఉదాహరణ. నేను కూడా కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన వాడిని కావడం వల్ల మరింత సంతోషంగా ఉంది. ఇప్పుడు కన్నడ ఫిల్మ్‌ ఇండస్ట్రీ గురించి ఎంతో మంది మాట్లాడుకుంటున్నారు. ఇప్పటి వరకూ ఈ ఇండస్ట్రీ నుంచి వంశ వృక్ష, ఒందనొండు కలదల్లి, కాడులాంటి సినిమాలు వచ్చాయి. మళ్లీ ఆ రోజులు తిరిగి వస్తున్నాయనిపిస్తోంది" అని కమల్‌ అన్నాడు.

ఇందులోనే పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కూడా మాట్లాడాడు. "2022లో వివిధ ఇండస్ట్రీల నుంచి గొప్ప సినిమాలు వచ్చాయి. కానీ ఒక్క సినిమా మాత్రం నాపై చాలా ప్రభావం చూపింది. ఈ సినిమా మలయాళంలో వచ్చి ఉంటే బాగుండేది లేదంటే కనీసం నేను అందులో భాగమై ఉండాల్సింది అనిపించేలా చేసింది కాంతారా" అని పృథ్వీరాజ్‌ అన్నాడు.

IPL_Entry_Point

టాపిక్