Kantara Breaks KGF 2 Record: వావ్‌.. కేజీఎఫ్‌ 2 రికార్డునే బ్రేక్‌ చేసిన కాంతారా కలెక్షన్లు-kantara breaks kgf 2 record in karnataka ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kantara Breaks Kgf 2 Record: వావ్‌.. కేజీఎఫ్‌ 2 రికార్డునే బ్రేక్‌ చేసిన కాంతారా కలెక్షన్లు

Kantara Breaks KGF 2 Record: వావ్‌.. కేజీఎఫ్‌ 2 రికార్డునే బ్రేక్‌ చేసిన కాంతారా కలెక్షన్లు

HT Telugu Desk HT Telugu

Kantara Breaks KGF 2 Record: కేజీఎఫ్‌ 2 రికార్డునే బ్రేక్‌ చేశాయి కాంతారా కలెక్షన్లు. బాక్సాఫీస్‌ దగ్గర ఇప్పటికీ దూసుకెళ్తున్న ఈ మూవీ ఇప్పుడు కర్ణాటకలో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా నిలిచింది.

కర్ణాటకలో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా కాంతారా

Kantara Breaks KGF 2 Record: ఒకటీ రెండు కాదు.. కాంతారా రిలీజై 50 రోజులకుపైనే అయింది. అయినా ఈ మూవీకి ఉన్న క్రేజ్‌ ఏమాత్రం తగ్గడం లేదు. పైగా ఇప్పటికీ రికార్డుల మీద రికార్డులు బ్రేక్‌ చేస్తూనే ఉంది. మూవీ రిలీజైన 8వ వారం మరోసారి బాక్సాఫీస్‌ కలెక్షన్లు పెరగడం విశేషం. ఈ క్రమంలో కర్ణాటకలో ఆ మూవీ చరిత్ర సృష్టించింది.

ఈసారి ఏకంగా కేజీఎఫ్‌ 2 రికార్డునే బ్రేక్‌ చేసి.. కర్ణాటకలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. చాలా రోజుల కిందటే థియేటర్లకు వచ్చిన కాంతారా చూసిన ప్రేక్షకుల సంఖ్య కేజీఎఫ్‌, కేజీఎఫ్ 2 రికార్డులను బ్రేక్‌ చేసింది. ఇక ఇప్పుడు కలెక్షన్ల పరంగానూ రిషబ్‌ శెట్టి మూవీ కేజీఎఫ్‌ 2ను బీట్‌ చేయడం విశేషం.

ఇప్పటి వరకూ ఇండియాలోనే కాంతారా మూవీ రూ.300 కోట్ల నెట్‌ మార్క్‌ను అందుకుంది. అందులో ఒక్క కర్ణాటకలోనూ కాంతారా రూ.160.5 కోట్ల నెట్‌ కలెక్షన్లు రాబట్టడం విశేషం. ఇప్పటి వరకూ కేజీఎఫ్‌ 2 మూవీ రూ.155 కోట్లతో టాప్‌లో ఉండగా.. ఇప్పుడు కాంతారా ఆ రికార్డును బ్రేక్‌ చేసింది.

ఇక ప్రపంచవ్యాప్తంగా కాంతారా మూవీ రూ.393.31 కోట్ల గ్రాస్‌ కలెక్షన్లు రాబట్టింది. అందులో ఇండియాలోనే రూ.359.31 కోట్ల గ్రాస్‌, రూ.304.5 కోట్ల నెట్‌ కలెక్షన్లు వచ్చాయి. ఓవర్సీస్‌లో ఈ మూవీ రూ.34 కోట్లు వసూలు చేసింది. సినిమా రిలీజై 50 రోజులు దాటినా ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా 1000కిపైగా స్క్రీన్లలో ఆడుతోందని మేకర్స్‌ వెల్లడించారు.

ఇక ఇండియాలోనే 900కుపైగా స్క్రీన్లలో కాంతారా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ మధ్యే ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌ డేట్‌ను కూడా అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వెల్లడించిన విషయం తెలిసిందే. ఓ నెటిజన్‌ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కాంతారా మూవీ నవంబర్‌ 24న తమ ఓటీటీలోకి వస్తున్నట్లు ప్రైమ్‌ వీడియో తెలిపింది.