Brahmastra Breaks KGF 2 Record: కేజీఎఫ్‌ 2 రికార్డును బ్రేక్‌ చేసిన బ్రహ్మాస్త్ర-brahmastra breaks kgf 2 record on national cinema day ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Brahmastra Breaks Kgf 2 Record On National Cinema Day

Brahmastra Breaks KGF 2 Record: కేజీఎఫ్‌ 2 రికార్డును బ్రేక్‌ చేసిన బ్రహ్మాస్త్ర

Hari Prasad S HT Telugu
Sep 23, 2022 09:56 AM IST

Brahmastra Breaks KGF 2 Record: కేజీఎఫ్‌ 2 రికార్డును బ్రేక్‌ చేసింది బ్రహ్మాస్త్ర మూవీ. నేషనల్‌ సినిమా డే సందర్భంగా బ్రహ్మాస్త్ర మూవీ బుకింగ్స్‌ కళ్లు చెదిరేలా ఉన్నాయి.

బ్రహ్మాస్త్ర మూవీ
బ్రహ్మాస్త్ర మూవీ

Brahmastra Breaks KGF 2 Record: బాలీవుడ్‌ను మళ్లీ గాడిలో పెట్టిన సినిమా బ్రహ్మాస్త్ర. భారీ బడ్జెట్‌తోపాటు అంతకంటే భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా అందుకు తగినట్లే భారీ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. సెప్టెంబర్‌ 9న రిలీజ్‌ అయిన ఈ మూవీ.. మూడో వారంలోకి అడుగుపెట్టినా కూడా బాక్సాఫీస్‌ దగ్గర ఇంకా రికార్డుల మోత మోగిస్తోంది.

తాజాగా శుక్రవారం (సెప్టెంబర్‌ 23) నేషనల్‌ సినిమా డే సందర్భంగా ఈ బ్రహ్మాస్త్ర మూవీ ఏకంగా కేజీఎఫ్‌ 2 రికార్డునే బ్రేక్‌ చేసింది. నేషనల్‌ సినిమా డే సందర్బంగా దేశవ్యాప్తంగా ఉన్న మల్టీప్లెక్స్‌లలో రూ.75కే టికెట్లను అమ్ముతున్న విషయం తెలిసిందే. దీంతో బ్రహ్మాస్త్రకు అడ్వాన్స్‌ బుకింగ్స్‌ పోటెత్తాయి. శుక్రవారం ఒక్క రోజే 6 లక్షల టికెట్లు అడ్వాన్స్‌ బుకింగ్స్‌ రూపంలో అమ్ముడయ్యాయి. ఇవి పది లక్షలు దాటినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

ఈ ఏడాది రిలీజైన ఈ సినిమాకైనా ఇదే అత్యధిక బుకింగ్స్‌ కావడం విశేషం. అంతేకాదు బ్రహ్మాస్త్ర తొలి రోజు అడ్వాన్స్‌ బుకింగ్స్‌ను కూడా ఇది మించిపోయింది. తొలి రోజు మూడు లక్షల వరకూ బుకింగ్స్‌ జరగగా.. ఇప్పుడది రెట్టింపైంది. నేషనల్ సినిమా డే రోజు మల్టీప్లెక్స్‌ టికెట్ల ధర రూ.75గానే ఉన్నా.. ప్రీమియం 3డీ, ఐమ్యాక్స్‌ వెర్షన్ల టికెట్లు మాత్రం రూ.150 నుంచి రూ.200గా నిర్ణయించారు.

ఈ అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ప్రకారం.. బ్రహ్మాస్త్ర మూవీని 15వ రోజు అత్యధిక మంది చూడబోతున్నారు. అయితే ఇది బాక్సాఫీస్‌ కలెక్షన్లను భారీగా ఏమీ పెంచడం లేదు. టికెట్ల ధరలు తగ్గడంతో బ్రహ్మాస్త్ర 15వ రోజు మొత్తంగా రూ.3.5 కోట్లు వసూలు చేయొచ్చని అంచనా వేస్తున్నారు. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత 12 గంటల షోల టికెట్లు కూడా పూర్తిగా అమ్ముడవడం విశేషం.

ఇక శుక్రవారమే రిలీజవుతున్న దుల్కర్‌ సల్మాన్‌ మూవీ చుప్‌: రివేంజ్‌ఆఫ్‌ ద ఆర్టిస్ట్‌కు కూడా ఇదే రకమైన క్రేజ్‌ కనిపించింది. ఈ మూవీ అడ్వాన్స్‌ బుకింగ్స్‌ లాల్‌ సింగ్‌ చడ్డాలాంటి పెద్ద సినిమాను కూడా మించిపోయాయంటే నమ్మశక్యం కాదు. నిజానికి నేషనల్‌ సినిమా డే నాడు బ్రహ్మాస్త్ర మొత్తం బుకింగ్స్‌ 9 లక్షల వరకూ ఉండొచ్చని కూడా అంచనా వేస్తున్నారు.

కేజీఎఫ్‌ 2 అడ్వాన్స్‌ బుకింగ్స్‌ 5.15 లక్షలుగా ఉన్నాయి. అదే బాహుబలి 2కు మాత్రం ఇది 6.5 లక్షలుగా ఉంది. రూ.410 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన బ్రహ్మాస్త్ర మూవీ ఇప్పటి వరకూ ప్రపంచవ్యాప్తంగా రూ.360 కోట్ల వసూళ్లు రాబట్టింది. అయాన్‌ ముఖర్జీ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియా భట్‌, నాగార్జున, అమితాబ్‌ బచ్చన్‌, మౌనీ రాయ్‌ నటించారు. షారుక్‌ ఖాన్‌, దీపికా పదుకోన్‌, డింపుల్‌ కపాడియా గెస్ట్‌ రోల్స్‌లో కనిపించారు.

IPL_Entry_Point