Kgf 2 Final Collection: కన్నడ సినీ పరిశ్రమను కేజీఎఫ్ కు ముందు కేజీఎఫ్ తర్వాతగా చెప్పుకోవచ్చు. సౌత్ కు మాత్రమే పరిమితమైన కన్నడ ఇండస్ట్రీ ఖ్యాతిని దేశవ్యాప్తంగా చాటిచెప్పింది కేజీఎఫ్ సినిమా. హీరోయిజం, కమర్షియల్ సినిమాకు కొత్త అర్థాన్ని ఇచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్ లో విడుదలైన కేజీఎఫ్ 2 చిత్రం వరల్డ్ వైడ్ గా 1200 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. యశ్ (Yash) ఎలివేషన్స్, ప్రశాంత్ నీల్ టేకింగ్ కు అన్ని భాషల సినీ అభిమానులు ఫిదా అయ్యారు. ,ఆర్ఆర్ఆర్, బాహుబలి 2 తర్వాత తొలిరోజు అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా కేజీఎఫ్ 2 నిలిచింది. అంతే కాకుండా ఇండియా వైడ్ గా అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాల్లో దంగల్, బాహుబలి 2 తర్వాత మూడో స్థానంలో కేజీఎఫ్ ఛాప్టర్ 2 నిలిచి రికార్డ్ క్రియేట్ చేసింది .ఈ ఏడాది డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లకు అత్యధిక లాభాలను మిగిల్చిన సినిమా కేజీఎఫ్ 2 కావడం గమనార్హం. ఈ సినిమాను దాదాపుగా 100 కోట్ల బడ్జెట్ తో నిర్మాత విజయ్ కిరగందూర్ నిర్మించారు. ,ఫైనల్ గా కేజీఎఫ్ 535 కోట్లకుపైగా షేర్ ను సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. పెట్టిన పెట్టుబడికి ఐదింతల లాభాల్ని ఈ సినిమా తెచ్చిపెట్టినట్లు సమాచారం. కేజీఎఫ్ 2లో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ గా నటించాడు. రవీనా టాండన్ కీలక పాత్ర పోషించింది. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం కేజీఎఫ్ 2కు కొనసాగింపుగా కేజీఎఫ్ 3 ని తెరకెక్కించబోతున్నట్లు యశ్, ప్రశాంత్ నీల్ ప్రకటించారు. ఫారిన్ బ్యాక్ డ్రాప్ లో కేజీఎఫ్ 3 సాగబోతున్నట్లు సమాచారం.