Brahmastra in 300 Crores Club: బ్రహ్మాస్త్ర సూపర్ హిట్.. రూ.300 కోట్ల క్లబ్‌లో మూవీ
Brahmastra in 300 Crores Club: బ్రహ్మాస్త్ర సూపర్ హిట్గా నిలిచింది. ఈ మూవీ రూ.300 కోట్ల క్లబ్‌లో చేరడం విశేషం. రణ్‌బీర్, ఆలియా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ సాధించింది.
Brahmastra in 300 Crores Club: కష్టాల్లో ఉన్న బాలీవుడ్‌కు కొత్త ఉత్సాహాన్నించింది బ్రహ్మాస్త్ర మూవీ. ఆ సినిమా ఇండస్ట్రీలో వరుస వైఫల్యాలు, బాయ్‌కాట్ పిలుపుల మధ్య రిలీజైన బ్రహ్మాస్త్ర మూవీ అంచనాలను మించి సక్సెస్ సాధించడం విశేషం. బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తున్న ఈ సినిమా తొలి వారంలోనే రూ.300 కోట్ల క్లబ్‌లో చేరడం విశేషం.
తొలివారం ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు కలిపితే రూ.300 కోట్లు దాటాయి. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేసిన ఈ మూవీపై రిలీజ్‌కు ముందే భారీ అంచనాలు ఉన్నాయి. అందులోనూ ఎన్నో ఏళ్ల పాటు ఎదురుచూసిన సినిమా. దీంతో ఆ మూవీ టీమ్‌తోపాటు బాలీవుడ్ కూడా బ్రహ్మాస్త్రపై భారీ ఆశలే పెట్టుకుంది. మొత్తానికి ఆ అంచనాలు నిజమై, ఆశలు ఫలించి సినిమా భారీ వసూళ్లు సాధించింది.
బ్రహ్మాస్త్ర.. గ్లోబల్ లెవల్లో నంబర్ వన్
బ్రహ్మాస్త్ర మూవీ తొలి వారంలో గ్లోబల్ నంబర్ వన్ మూవీగా నిలిచిందని ఈ మూవీ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ వెల్లడించాడు. ఈ సందర్భంగా సినిమా రూ.300 కోట్ల వసూళ్లు దాటిందని ఓ స్పెషల్ వీడియోను కూడా రిలీజ్ చేశాడు. "లవ్ అండ్ లైట్ గ్లోబల్ బాక్సాఫీస్‌ను శాసిస్తూ నంబర్ వన్‌గా నిలిచింది. హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతూ ఎంతో ఉత్సాహంగా రెండో వారంలోకి అడుగుపెడుతున్నాం" అంటూ కరణ్ జోహార్ ఈ వీడియోను షేర్ చేశాడు.
బ్రహ్మాస్త్ర మూవీలో రణ్‌బీర్, ఆలియాతోపాటు నాగార్జున, అమితాబ్ బచ్చన్, మౌనీ రాయ్ ఇతర ముఖ్యమైన పాత్రల్లో కనిపించారు. అటు బాలీవుడ్ బాద్‌షా షారుక్‌ఖాన్ కూడా స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చాడు. మూడు భాగాలుగా రానున్న ఈ మూవీలో పార్ట్ వన్ శివగా సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండో పార్ట్ దేవ్ అని కూడా అదే రోజు మేకర్స్ ప్రకటించారు.
బ్రహ్మాస్త్ర గురించి..
హాలీవుడ్ తో పోలిస్తే ఇండియన్ స్క్రీన్ పై సూపర్ హీరో కథాంశాలతో చాలా తక్కువ సినిమాలొచ్చాయి. ఈ జానర్ లో రూపొందిన చిత్రమే బ్రహ్మాస్త్ర. భారతీయ పురాణాలకు ప్రేమకథ, యాక్షన్ అంశాలను జోడించి దర్శకుడు అయాన్ ముఖర్జీ బ్రహ్మాస్త్ర సినిమాను తెరకెక్కించారు.
అత్యంత శక్తివంతమైన బ్రహ్మాస్త్రాన్ని చేజిక్కించుకోవాలని కొన్ని అతీంద్రియ శక్తులు ప్రయత్నిస్తుంటాయి. ఆ అదృశ్య శక్తులను ఎదురించి పురాతన శక్తులను కాపాడుతున్న కొన్ని అస్త్రాలతో కలిసి శివ సాగించిన పోరాటం నేపథ్యంలో బ్రహ్మాస్త్ర కథను రాసుకున్నాడు దర్శకుడు అయాన్ ముఖర్జీ. మైథలాజికల్ పాయింట్ ను భారీ గ్రాఫిక్స్ హంగులతో తెరపై ఆవిష్కరించారు. చెడుపై మంచి ఎప్పుడు గెలుస్తుంది. ఈ సినిమాలో అదే చూపించారు.