Naga Chaitanya: కాఫీ విత్‌ కరణ్‌ షోలో నాగ చైతన్య.. కరణ్‌ జోహార్‌ రియాక్షన్‌ ఇదీ!-i would love to host naga chaitanya on koffee with karan show says karan johar
Telugu News  /  Entertainment  /  I Would Love To Host Naga Chaitanya On Koffee With Karan Show Says Karan Johar
కాఫీ విత్ కరణ్ షోలో కరణ్ జోహార్, అక్షయ్, సమంత
కాఫీ విత్ కరణ్ షోలో కరణ్ జోహార్, అక్షయ్, సమంత (Instagram)

Naga Chaitanya: కాఫీ విత్‌ కరణ్‌ షోలో నాగ చైతన్య.. కరణ్‌ జోహార్‌ రియాక్షన్‌ ఇదీ!

19 August 2022, 14:19 ISTHT Telugu Desk
19 August 2022, 14:19 IST

Naga Chaitanya: కాఫీ విత్‌ కరణ్‌ సీజన్‌ 7లో సమంత ఓ ఎపిసోడ్‌లో మెరిసింది. అప్పటి నుంచి చైతూతో ఆమె విడాకుల విషయం మరోసారి తెరపైకి వచ్చింది. ఆ తర్వాత తాను కూడా ఈ షోలో పాల్గొనాలని అనుకుంటున్నట్లు నాగ చైతన్య చెప్పిన విషయం తెలిసిందే.

బాలీవుడ్‌ సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ తనదైన స్టైల్‌ ప్రశ్నలతో కాఫీ విత్‌ కరణ్‌ షోను టాప్‌ రేటింగ్స్‌ షోలలో ఒకటిగా నిలిపాడు కరణ్‌ జోహార్‌. ఈ షో సీజన్‌ 7 ప్రస్తుతం డిస్నీ+హాట్‌స్టార్‌లో వస్తోంది. ప్రతి గురువారం ఓ కొత్త ఎపిసోడ్‌ ప్రేక్షకులను అలరిస్తోంది. ఆ మధ్య మూడో ఎపిసోడ్‌లో సమంత కూడా ఈ షో చేసింది. అక్షయ్‌కుమార్‌తో కలిసి ఈ షో కోసం వచ్చిన ఆమె తన విడాకుల ఎపిసోడ్‌పై మాట్లాడింది.

ఆ తర్వాత ఏదో ఇంటర్వ్యూలో నాగ చైతన్య మాట్లాడుతూ.. తాను కూడా ఈ షోలో పాల్గొనడంపై ఆసక్తి చూపించాడు. ఇదే విషయాన్ని తాజాగా ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కరణ్‌ జోహార్‌కు చెప్పగా.. అతడు కూడా చాలా ఆనందం వ్యక్తం చేశాడు. చైతన్యను తన షోకు ఆహ్వానించడంపై కరణ్‌ ఆసక్తిగా ఉన్నాడు. అతని నటన తనకు బాగా నచ్చుతుందని చెప్పాడు.

"అతన్ని ఇంటర్వ్యూ చేయడం నాకు కూడా ఇష్టమే. అతడో అద్భుతమైన నటుడు. లాల్‌ సింగ్‌ చడ్డాలో అతన్ని చూడటానికి ఆసక్తిగా ఉన్నాను. అతని కెరీర్‌ మొత్తం నేను ట్రాక్‌ చేశాను. చాలా బాగా చేశాడు. నిజానికి అతని తండ్రి (నాగార్జున)కి నేను పెద్ద అభిమానిని. అందుకే నేను కచ్చితంగా చైతన్యను ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాను" అని కరణ్‌ అన్నాడు.

కరణ్‌ జోహార్‌ ఆసక్తిని చూస్తుంటే.. త్వరలోనే చైతూని తన షోకు ఆహ్వానించేలా ఉన్నాడు. కాకపోతే కాస్త సెన్సిటివ్‌గా ఉండే నాగ చైతన్య.. ఈ షోలో కరణ్‌ ప్రశ్నలను తట్టుకోవడం కష్టమేనేమో. ఎందుకంటే తన షోకు వచ్చిన ప్రతి సెలబ్రిటీని కరణ్‌ చాలా బోల్డ్‌ ప్రశ్నలు అడుగుతుంటాడు. కాఫీ విత్‌ కరణ్‌ షో అంటేనే వివాదాలకు కేంద్రంగా మారింది.

సంబంధిత కథనం