Nayanthara: కరణ్‌ జోహార్‌పై తీవ్రంగా మండిపడుతున్న నయన్‌ ఫ్యాన్స్‌.. ఇదీ కారణం-nayanthara fans trolling karan johar for his comments on her in koffee with karan show ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nayanthara: కరణ్‌ జోహార్‌పై తీవ్రంగా మండిపడుతున్న నయన్‌ ఫ్యాన్స్‌.. ఇదీ కారణం

Nayanthara: కరణ్‌ జోహార్‌పై తీవ్రంగా మండిపడుతున్న నయన్‌ ఫ్యాన్స్‌.. ఇదీ కారణం

HT Telugu Desk HT Telugu

Nayanthara: సౌత్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో లేడీ సూపర్‌స్టార్‌గా పేరుగాంచిన నయనతారపై బాలీవుడ్‌ డైరెక్టర్‌ కరణ్‌ జోహార్‌ నోరు పారేసుకోవడంపై ఆమె ఫ్యాన్స్‌ సీరియస్‌ అవుతున్నారు.

నయనతార

కాఫీ విత్‌ కరణ్‌ షోతో కాస్త ఎక్కువగానే నెగటివ్‌ వార్తల్లో నిలుస్తుంటాడు బాలీవుడ్‌ డైరెక్టర్‌ కరణ్‌ జోహార్‌. ఈ షో చాలా పాపులరే అయినా.. దీనికి వచ్చే స్టార్లను అతడు అడిగే ప్రశ్నలు, వాళ్లు చెప్పే సమాధానాలు తరచూ నెగటివ్‌ పబ్లిసిటీని అట్రాక్ట్‌ చేస్తాయి. తాజాగా సమంత కూడా ఈ షోకు వెళ్లిన సంగతి తెలుసు కదా. ఈ సందర్భంగా కరణ్‌ సౌత్‌ ఇండియన్‌ స్టార్‌ హీరోయిన్‌ నయనతారపై చేసిన కామెంట్స్‌ దుమారం రేపుతున్నాయి.

అక్షయ్‌కుమార్‌తో కలిసి ఈ షోకు వెళ్లిన సమంత తన పెళ్లి గురించి చేసిన కామెంట్స్‌ కూడా వైరల్‌ అయిన విషయం తెలిసిందే. ఇదే కాకుండా ఎన్నో టాపిక్స్‌ మీద వీళ్లు మాట్లాడారు. ఇందులో భాగంగా నయనతారతో కలిసి నటించడం గురించి సమంత చెప్పింది. సౌత్‌లో బిగ్గెస్ట్‌ సూపర్‌ స్టార్‌ నయనతార అని సమంత చెబుతుండగా.. లేదు, నా లిస్ట్‌ ప్రకారం అయితే కాదు అని కరణ్‌ అన్నాడు.

ఇది విని సమంత కాస్త షాక్‌కు గురైనా ఇబ్బందికరంగా నవ్వింది. అయితే కరణ్‌ ఇలా రియాక్టవడం నయన్‌ ఫ్యాన్స్‌ను మాత్రం ఆగ్రహానికి గురి చేసింది. అప్పటి నుంచి ట్విటర్‌లో కరణ్‌ను ట్రోల్‌ చేస్తున్నారు. నయన్‌ నీ లిస్ట్‌లో లేకపోవడం మంచిదే.. ఆమె నీ కన్నా చాలా రెట్లు గొప్ప అని ఓ ఫ్యాన్‌ ట్విటర్‌లో రాశాడు. ఆమె గురించి తెలుసుకొని మాట్లాడితే మంచిది అని మరొకరు కామెంట్‌ చేశారు.

నోర్మూసుకో కరణ్‌.. సౌత్‌తో పెట్టుకోకు అని మరో యూజర్‌ చాలా ఘాటుగా స్పందించాడు. ఈ మధ్యే నయనతార, సమంత, విజయ్‌ సేతుపతి కలిలి ఓ మూవీలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా గురించే ఆ షోలో సమంత మాట్లాడింది.