Naga Chaitanya: సమంతాకు పరోక్షంగా కౌంటర్ ఇచ్చిన నాగచైతన్య-naga chaitanya make a indirect counter to samantha ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Naga Chaitanya Make A Indirect Counter To Samantha

Naga Chaitanya: సమంతాకు పరోక్షంగా కౌంటర్ ఇచ్చిన నాగచైతన్య

Maragani Govardhan HT Telugu
Aug 12, 2022 04:33 PM IST

కాఫీ విత్ కరణ్ షోలో ఇటీవల పాల్గొన్న సమంతా.. నాగచైతన్యపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై చై తనదైన శైలిలో స్పందించాడు. పరోక్షంగా ఆమెకు కౌంటర్ ఇచ్చాడు.

సమంత-నాగచైతన్య
సమంత-నాగచైతన్య (Twitter)

నాగచైతన్య, సమంత విడిపోయి 10 నెలలు కావస్తున్నా.. ఇంకా వారి గురించి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. వీరిద్దరి మధ్య విడాకులు రావడానికి గల కారణంపై విభిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి. అయితే చాలా కాలం వరకు వీరిద్దరూ తాము విడిపోవడానికి గల కారణం గురించి చెప్పలేదు. అయితే ఇటీవల బాలీవుడ్ పాపులర్ షో పాల్గొన్న సమంత.. తొలిసారి విడాకులపై స్పందించింది. తామిద్దరిని ఓ రూంలో బందిస్తే.. తప్పనిసరి పదునైన వస్తువులు ఏమైనా ఉంటే వాటిని దాచిపెట్టాలని లేకుండా ప్రమాదం జరిగే అవకాశముంటుందని సంచలన వ్యాఖ్యలు చేసింది సామ్.

దీంతో వీరిద్దరి మధ్య గొడవలు తారాస్థాయిలో ఉన్నాయని అర్థమవుతుంది. ఇదే విషయంపై నాగచైతన్యను అడుగ్గా.. నేనైతే హాయ్ అని చెప్పి.. తనకు ఓ హగ్ ఇస్తానని బదులిచ్చాడు. తాను నటించిన లాల్ సింగ్ చడ్ఢా ప్రమోషన్లలో పాల్గొన్న చైను ఈ ప్రశ్న అడిగారు. విడాకులపై సామ్ ఉన్నంత సీరియస్‌గా నాగచైతన్య లేడని అతడి సమాధానం బట్టే తెలుస్తుంది. అంతేకాకుండా సమంతాకు పరోక్షంగా సూపర్ కౌంటర్ ఇచ్చాడని అభిమానులు భావిస్తున్నారు.

సమంత కాఫీ విత్ కరణ్ షోలో చెప్పిన సమాధానానికి నాగచైతన్య తాజా స్టేట్మెంట్ కౌంటర్‌ వలే ఉందని అనుకుంటున్నారు. ఇప్పటికే వీరిద్దరూ విడిపోవడానికి ప్రధాన కారణం సమంతానే అని ఆమెను తప్పు పడుతున్నారు. నెట్టింట ఆమెను విపరీతంగా ట్రోలింగ్ చేశారు.

ప్రస్తుతం పని విషయానికొస్తే నాగచైతన్య నటించిన లాల్ సింగ్ చడ్ఢా ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ ఈ సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్