Taapsee: కాఫీ విత్ కరణ్ షో పై తాప్సీ బోల్డ్ కామెంట్స్-taapsee bold comments on koffee with karan show ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Taapsee: కాఫీ విత్ కరణ్ షో పై తాప్సీ బోల్డ్ కామెంట్స్

Taapsee: కాఫీ విత్ కరణ్ షో పై తాప్సీ బోల్డ్ కామెంట్స్

HT Telugu Desk HT Telugu

బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న కాఫీ విత్ కరణ్ పై కథానాయిక తాప్సీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆమె చేసిన కామెంట్స్ బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

తాప్సీ (INSTAGRAM)

తన మనసులోని అభిప్రాయాలను నిర్మోహమాటంగా వ్యక్తపరిచే కథానాయికల్లో తాప్సీ ఒకరు. సినిమాలు, వ్యక్తిగత జీవితంపై పలుమార్లు ఆమె చేసిన కామెంట్స్, ఇచ్చిన స్టేట్ మెంట్స్ వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి తాప్సీ దర్శకనిర్మాత కరణ్ జోహార్ టాక్ షో కాఫీ విత్ కరణ్ పై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.

తాప్సీ హీరోయిన్ గా నటించిన దోబారా సినిమాతో ఆగస్ట్ 19న రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ తో తాప్సీ బిజీగా ఉంది. గత కొద్ది రోజులుగా సినిమా రిలీజ్ ల ముందు బాలీవుడ్ స్టార్స్ కరణ్ జోహార్ కాఫీ విత్ కరణ్ షోకు హాజరవుతుండటం అనవాయితీగా మారింది. ఇటీవలే అక్షయ్ కుమార్, విజయ్ దేవరకొండ ఈ షోకు హాజరయ్యారు.

తాప్సీ సినిమా రిలీజ్ కు ఉండటంతో ఆమె షోకు హాజరవుతుందని అనుకున్నారు. కానీ ఇప్పటివరకు తాప్సీ ఈ షోలో కనిపించలేదు.దీని గురించి దోబారా ప్రమోషనల్ ఈవెంట్ లో ఓ మీడియా ప్రతినిధి మీరు కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొనపోవడానికి కారణమేమిటని తాప్సీని ప్రశ్నించారు. ‘ఆ షోకు ఆహ్వానం అందుకునేంత ఇంట్రెస్టింగ్ గా నా సెక్స్ లైఫ్ లేదు.

అందుకే ఆ షోలో కనిపించలేదు’ అంటూ ఫన్నీగా సమాధానం చెప్పింది. తాప్సీ సమాధానం బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కాఫీ విత్ కరణ్ షో మసాలా టాక్ షో అంటూ తాప్సీ చెప్పకనే చెప్పిందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ షోకు ఇటీవల విజయ్ దేవరకొండ, అనన్యా పాండే హాజరయ్యారు. వారిని కరణ్ జోహార్ ఆడిగిన ప్రశ్నల్లో ఎక్కువగా సెక్స్ రిలేటెడ్ వే ఉండటం వివాదాస్పదంగా మారింది.